తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Glenn Maxwell: మ్యాక్స్‌వెల్‌ విశ్వరూపం.. మెరుపు సెంచరీతో రికార్డు సమం

అడిలైడ్‌ వేదికగా వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్(22), జోష్ ఇంగ్లిస్(4), మిచెల్ మార్ష్ (29) పరుగులు చేశారు. ఆ తర్వాత గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విశ్వరూపం చూపాడు. కేవలం 50 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. టీ20ల్లో ఐదు సెంచరీలు పూర్తి చేసిన మ్యాక్స్‌వెల్‌.. రోహిత్‌ శర్మ రికార్డును సమం చేశాడు.

ALSO READ: టాస్‌ ఓడిన భారత్.. బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

మ్యాక్సీ ఊచకోత..

రెండో టీ20లో మ్యాక్స్‌వెల్‌ కరేబియన్లపై విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన మ్యాక్సీ.. 50 బంతుల్లో శతకం బాదాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 55 బంతులాడిన మ్యాక్స్‌వెల్‌.. 12 బౌండరీలు, 8 భారీ సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాక్స్‌వెల్‌‌తోపాటు టిమ్‌ డేవిడ్‌ (14 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కరేబియన్లను ఆడుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button