తెలుగు
te తెలుగు en English
క్రికెట్

U19 World Cup Final: టాస్‌ ఓడిన భారత్.. బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

అండర్‌-19 వరల్డ్ కప్‌ 2024 ఫైనల్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై జ‌రుగుతున్నఈ అండ‌ర్-19 వరల్డ్ కప్‌‌లో బెనోని వేదికగా ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఏ మార్పులు లేకుండా బ‌రిలోకి దిగుతుండగా.. ఆసీస్‌ మాత్రం ఒక మార్పుతో ఆడనుంది. కాగా, భారత్‌, ఆసీస్‌ ఫైనల్‌లో తలపడడం ఇది నాలుగోసారి. ఇం‍తకుముందు రెండు సార్లు భారత్‌ విజయం సాధించగా.. ఆసీస్‌ ఒక్కసారి గెలుపొందింది.

ALSO READ: జడేజా, రాహుల్ కి టెస్ట్ జట్టులో చోటు… కానీ వారి అనుమతి ఉంటేనే?

జట్లు ఇవే..

భారత్‌: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ అహ్మద్ ఖాన్, ఉదయ్ సహారన్ (C), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్ (WC), మురుగన్ అభిషేక్, నమన్ తివారీ, రాజ్ లింబాని, సౌమీ పాండే. ఆస్ట్రేలియా: హ్యారీ డిక్సన్, సామ్ కొన్‌స్టాస్, హ్యూ వీబ్‌జెన్ (C), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్ (WC), ఆలీ పీక్, చార్లీ ఆండర్సన్, రాఫెల్ మాక్‌మిలన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button