తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IND VS SA: భారీ షాట్‌కు అద్దాలు ధ్వంసం.. సారీ చెప్పిన రింకూ

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మొదటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. పోర్ట్‌ ఎలిజబెత్‌ వేదికగా జరిగిన టీ20లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది. అంతకుముందు 19.3 ఓవర్లకు భారత్ ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. తర్వాత వర్షం పడడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను 15 ఓవర్లకు కుదించి.. విజయ లక్ష్యాన్ని 152 పరుగులుగా నిర్దేశించారు. దీంతో సౌతాఫ్రికా 13.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసి విజయం సాధించింది.

ALSO READ: స్వియాటెక్ మ‌రో ఘ‌న‌త..‘ప్లేయ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్’ అవార్డు

రింకూ.. భారీ షాట్స్

భారత్ తరఫున టీ20లలో అదరగొడుతున్న యువ బ్యాటర్‌ రింకూ సింగ్‌ మరోసారి తన ప్రతిభను బయటపెట్టాడు. కీలక సమయంలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు విఫలమయ్యారు. దీంతో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(56)తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. కేవలం 39 బంతుల్లోనే 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే 19వ ఓవర్‌లో మార్క్రమ్‌ బౌలింగ్‌లో రింకూ స్ట్రెయిట్‌ హిట్‌ కారణంగా బంతి సైట్‌స్క్రీన్‌ పై మీదుగా వెళ్లి మీడియా బాక్స్ పగిలింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ALSO READ: టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన…నేపాల్ పై ఘనవిజయం

సారీ చెప్పిన రింకూ..

మ్యాచ్‌ అనంతరం సైట్‌స్క్రీన్‌ బ్రేక్‌ రింకూ సింగ్‌ స్పందించారు. ‘ మ్యాచ్‌ సమయంలో సూర్య భాయ్‌ నాకు సూచనలు ఇచ్చారు. ఒత్తిడికి లోనుకాకుండా నీ సహజమైన ఆటనే ఆడమని చెప్పారు. తొందరపాటు తగదు.. భారీ షాట్ల కోసం కాస్త ఓపికగా ఎదురు చూడాలన్నారు. 19వ ఓవర్‌లో ఆ బంతిని సిక్సర్‌గా మలచాలని మాత్రమే భావించాను. కానీ నా షాట్‌ కారణంగా మీడియా బాక్స్ అద్దం పగిలిపోయిందని నాకు తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడే తెలిసింది. మీడియా బాక్స్ బ్రేక్‌ చేసినందుకు సారీ చెబుతున్నా’ అని పేర్కొన్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button