తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IPL Schedule: ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ విడుదల… మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి!

ఐపీఎల్ 2024 సందడి షురూ అయ్యింది. ఐపీఎల్ 17 వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. BCCI 2024 సీజన్‌కు పాక్షిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొదటి 17 రోజులు అంటే మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు మ్యాచ్ ల వివరాలు ప్రకటించింది. మార్చి 22న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత మిగిలిన షెడ్యూల్‌ను ప్రకటించాలని భావిస్తోంది.

Also Read: బీసీసీఐకి శ్రేయస్ మస్కా.. అడ్డంగా దొరికిపోయాడుగా!

ఈ క్రమంలో మ్యాచ్ జరిగే తేదీ, జట్ల పేర్లు, మైదానం వివరాలు ఇప్పుడు చూద్దాం…!

మార్చి 22: చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (చెన్నై)
మార్చి 23: పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ (మొహాలీ)
మార్చి 23: కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ వర్సెస్ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (కోల్‌ కతా)
మార్చి 24: రాజస్థాన్ రాయల్స్‌ వర్సెస్ లఖ్‌ నవూ సూపర్‌ జెయింట్స్‌ (జైపుర్)
మార్చి 24: గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్ ముంబయి ఇండియన్స్‌ (అహ్మదాబాద్‌)
మార్చి 25: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్‌ (బెంగళూరు)
మార్చి 26: చెన్నై సూపర్ కింగ్స్‌ వర్సెస్ గుజరాత్‌ టైటాన్స్ (చెన్నై)
మార్చి 27: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్ ముంబయి ఇండియన్స్‌ (హైదరాబాద్‌)
మార్చి 28: రాజస్థాన్‌ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ (జైపుర్)
మార్చి 29: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వర్సెస్ కోల్‌ కతా నైట్‌ రైడర్స్ (బెంగళూరు)
మార్చి 30: లఖ్‌ నవూ సూపర్‌ జెయింట్స్‌ వర్సెస్ పంజాబ్‌ కింగ్స్‌ (లఖ్‌ నవూ)
మార్చి 31: గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్ సన్‌ రైజర్స్ హైదరాబాద్ (అహ్మదాబాద్‌)
మార్చి 31: ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌ (వైజాగ్‌)
ఏప్రిల్ 01: ముంబయి ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్‌ రాయల్స్ (ముంబయి)
ఏప్రిల్ 02: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వర్సెస్ లఖ్‌ నవూ సూపర్‌ జెయింట్స్‌ (బెంగళూరు)
ఏప్రిల్ 03: ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ కోల్‌ కతా నైట్‌ రైడర్స్ (వైజాగ్‌)
ఏప్రిల్ 04: గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్ పంజాబ్‌ కింగ్స్‌ (అహ్మదాబాద్‌)
ఏప్రిల్ 05: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌ (హైదరాబాద్‌)
ఏప్రిల్ 06: రాజస్థాన్‌ రాయల్స్ వర్సెస్ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (జైపూర్)
ఏప్రిల్ 07: ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ (ముంబయి)
ఏప్రిల్ 07: లఖ్‌ నవూ సూపర్‌ జెయింట్స్‌ వర్సెస్ గుజరాత్‌ టైటాన్స్‌ (లఖ్‌ నవూ)

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button