తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Jalaj Saxena: రంజీ ట్రోఫీలో అద్భుతం.. 9 వికెట్లు తీసిన ఒకే బౌలర్

వెటరన్ ఆఫ్ స్పిన్నర్ జలజ్ సక్సేనా తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు. ఒక్కడే 9 వికెట్లు తీసి రంజీ ట్రోఫీలో సంచలన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. తిరువనంతపురంలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ గ్రౌండ్‌లో ఆదివారం బెంగాల్‌తో జరిగిన ఈ మ్యాచ్ లో కేరళ తరపున ఈ గణాంకాలను నమోదు చేశాడు. దీంతో రంజీ ట్రోఫీలో కేరళ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో రెండో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

Also read: David Warner: క్రికెట్ కు స్టార్ ప్లేయర్ గుడ్ బై.. ఆ సిరీస్ చివరిదని ప్రకటన

తొలిసారిగా 1971 లో కన్నూర్‌లో ఆంధ్రాపై అమర్‌జిత్ సింగ్ 45 పరుగులిచ్చి 9 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటివరకు కేరళ రంజీ చరిత్రలో ఇదే బెస్ట్ బౌలింగ్ స్పెల్. ఈ మ్యాచ్ లో సక్సేనా 63 పరుగులిచ్చి 9 వికెట్లు తీసుకొని రెండో స్థానంలో నిలిచాడు. మిగిలిన ఒక వికెట్ ను నిదీష్ తీసుకున్నాడు. ఈ సీనియర్ స్పిన్నర్ ధాటికి బెంగాల్ తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే ఆలౌటైంది. అంతకముందు కేరళ తొలి ఇన్నింగ్స్ లో 363 పరుగులు చేసింది. దీంతో కేరళకు 163 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. క్రీజ్ లో శ్రేయాస్ గోపాల్ (14), మహమ్మద్ అజారుద్దీన్ (11) ఉన్నారు. సచిన్ బేబీ (51), రోహన్ కున్నముల్ (51) హాఫ్ సెంచరీలు చేశారు. షాబాజ్ అహ్మద్ కు రెండు వికెట్లు దక్కాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button