తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Mohammed Siraj: విజృంభించిన సిరాజ్… కుప్పకూలిన సఫారీల టాపార్డర్

దక్షిణాఫ్రికా వేదికగా న్యూలాండ్ గ్రౌండ్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన సఫారీ జట్టు బ్యాటింగ్ తీసుకుంది. అయితే బౌలింగ్ లో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు.

Also read: National Kabaddi Competitions: కామారెడ్డిలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

బౌలింగ్ చేసిన 9 ఓవర్లలో 3 మెయిడిన్స్.. కేవలం 15 పరుగులు.. ఏకంగా 6 వికెట్లు.. పేసీ పిచ్ లపై నిప్పులు చెరిగే బంతులేస్తూ సఫారీ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు సిరాజ్. అతన్ని ఎదుర్కోవటానికి.. వికెట్లు పడకుండా కాపాడుకోవటానికి సౌతాఫ్రికా బ్యాటర్లు నానా తంటాలు పడుతున్నారు.

తొలి స్పెల్‌‌లో మార్‌క్రమ్ (2), డీన్‌ ఎల్గర్‌(4), టోనీ డిజోర్జి (2)ను ఔట్ చేసిన సిరాజ్.. రెండో స్పెల్‌‌లో డేవిడ్ బెడింగ్‌హామ్(12), కైల్ వెర్రేన్నే(15), మార్కో జాన్సెన్(0), పెవిలియన్ చేర్చాడు. మరోవైపు భారత బౌలర్ల నుంచి కూడా సహకారం అందడంతో దక్షిణాఫ్రికా స్కోర్ 23.2 ఓవర్లలోనే 55 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా, ముఖేశ్ కుమార్ చెరి రెండు వికెట్లు తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button