తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Mustafizur Rahman: బంగ్లా స్టార్‌ బౌలర్‌ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు

బంగ్లాదేశ్‌ స్టార్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ గాయపడ్డాడు. స్వదేశంలో జరుగుతున్న బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రాక్టీస్‌ సెషన్స్‌లో కొమిల్లా విక్టోరియన్స్‌ జట్టుకు చెందిన స్టార్‌ బ్యాటర్‌ లిటన్‌ దాస్‌ విసిరిన బంతికి ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ తలకు తగిలి రక్తం కారింది. దీంతో అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ALSO READ: భారత్ ఆల్ రౌండ్ షో.. ఇంగ్లాండ్ కు భారీ టార్గెట్

బంగ్లాదేశ్‌ జట్టుకు ఎదురుదెబ్బే..

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ ముగిసిన తర్వాత ఆ జట్టు.. వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనకు ముందే ముస్తాఫిజుర్‌ గాయపడటం ఆ జట్టుకు ఎదురుదెబ్బే. అంతముందు గాయం తగిలిన వెంటనే అక్కడ ఉన్న ఫిజియోలు రక్తస్రావం కాకుండా ప్రథమ చికిత్స అందించారు. తర్వాత టెస్ట్‌లు చేయగా అతడికి తల లోపల ఎలాంటి ప్రమాదమూ జరగలేదని తేలింది. అయితే కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button