తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Rachin Ravindra: రచిన్ రవీంద్రకు దిష్టి తీసిన నాయనమ్మ… వీడియో వైరల్

భారత్ లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ద్వారా వెలుగులోకి వచ్చిన న్యూజిలాండ్ యువ సంచనం రచిన్ రవీంద్ర. అతని బ్యాట్ నుంచి ఈ మెగా టోర్నీలో పరుగుల వరద పారుతుంది. 9 మ్యాచ్ ల్లో 565 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 2 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు ఉన్నాయి. ఈ క్రమంలో 23 ఏళ్ల రచిన్… క్రికెట్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా అధిగమించాడు. 1996 వరల్డ్ కప్ లో సచిన్ 523 పరుగులు చేయగా, ఇప్పుడా అత్యధిక పరుగుల రికార్డును రచిన్ రవీంద్ర బద్దలు కొట్టాడు.

నానమ్మ ప్రేమ

రచిన్ రవీంద్ర భారతీయ మూలాలు కలిగిన న్యూజిలాండ్ పౌరుడు అని అందరికి తెలిసిన విషయమే. రచిన్ నానమ్మ, తాతయ్యలు బెంగళూరులో ఉండగా… తండ్రి రవి కృష్ణమూర్తి చాన్నాళ్ల కిందటే న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఈ క్రికెటర్ తాతయ్య బాలకృష్ణ అడిగా ఓ ప్రముఖ విద్యావేత్త. వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా రచిన్ రవీంద్ర బెంగళూరు రాగా, తన నాయనమ్మ, తాతయ్యల ఇంటికి వెళ్లాడు. అక్కడ రచిన్ కు నాయనమ్మ పూర్ణిమ దిష్టి తీశారు. తన మనవడి పేరు మార్మోగుతుండడంతో అతడికేమైనా నరదృష్టి సోకుతుందేమోనని ఆమె ఆందోళన చెందారు. అందుకే, అతడ్ని కూర్చోబెట్టి దిష్టి తీసివేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button