తెలుగు
te తెలుగు en English
క్రికెట్

TEAM INDIA: బార్బడోస్ లో మెరుగుపడిన వాతావరణం.. స్వదేశానికి బయల్దేరిన టీమిండియా

బార్బడోస్‌లో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా క్రికెట్ జట్టు రేపు ఉదయం వరకు భారతదేశానికి చేరుకోనుంది. ఇండియాకు వచ్చిన తర్వాత టీమిండియా క్రికెట్ బృందం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. అయితే 2007లో టైటిల్‌ను గెలుచుకున్న భారత్ మళ్లీ 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు టైటిల్‌ను సాధించింది. 2007లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలిచినప్పుడు మొత్తం జట్టును ఓపెన్ టాప్ బస్సులో ముంబై నగరంలో తిప్పారు. ఆ సమయంలో వేలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ వారికి ఆపూర్వ మద్దతు తెలిపారు.

Read also: IND Vs ZIM: భారత్- జింబాబ్వే టీ20 సిరీస్.. జింబాబ్వే జట్టు ఇదే!

ఇప్పుడు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ముంబైలో ఓపెన్ బస్సులో టీమిండియా ప్లేయర్స్ చక్కర్లు కొట్టనున్నారని సమాచారం. అయితే, బార్బడోస్‌లో హెరికేన్ ప్రభావంతో రోహిత్ సేన అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బార్బడోస్‌లోని విమానాశ్రయం మూసివేశారు. దీని కారణంగా ఆటగాళ్లు, వారి కుటుంబాలు, సహాయక సిబ్బంది, అధికారులు అందరూ అక్కడ చిక్కుకున్నారు. ఆ తర్వాత బీసీసీఐ ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత ఆటగాళ్లు, వారి కుటుంబాలు ఈరోజు అర్ధరాత్రి 1 గంట తర్వాత భారత్ చేరుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button