KALKI 2898 AD: బాలీవుడ్ సినిమాలపై కల్కి ఎఫెక్ట్.. మూవీ రిలీజ్ డేట్లు వాయిదా
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. వసూళ్ల పరంగా కూడా కల్కి సినిమా దుమ్ము లేపుతోంది. ఇప్పటికే 55 కోట్ల వసూలను రాబట్టిన సినిమా ఈ వారం చివరకు వేయి కోట్ల మార్కును దాటేసే దిశగా కలెక్షన్లను రాబడుతోంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో పూర్తిగా కల్కి సినిమా మానియా ఉండడంతో వచ్చే వారంలో సినిమాలు విడుదల చేసేందుకు ధైర్యం చేయట్లేదు.
Read also: Glimpse: ఎవడికోసం తగ్గాలి?.. ఎందుకు తగ్గాలి?…’బచ్చల మల్లి’ గ్లింప్స్ రిలీజ్
ఇకపోతే ఉత్తర భారతంలోనూ కల్కి తన హవా సాగిస్తోంది. ఈ దెబ్బతో బాలీవుడ్ లో స్టార్ హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ టబు నటించిన చిత్రం “ఔరోన్ మెయిన్ కహాన్ దం తా” సినిమా కల్కి కారణంగా వచ్చే వారానికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఒకవేళ సినిమా రిలీజ్ చేస్తే కల్కి సినిమా ఎఫెక్ట్ ఆ సినిమాపై తప్పకుండా పడుతుందని చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సినిమా మేకర్స్ నుండి త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. నీరజ్ పాండే ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. ఫ్రైడే ఫిలిం వర్క్స్, ఎన్ హెచ్ స్టూడియోస్ కలిసి చిత్రాన్ని నిర్మించారు.