తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Isha Koppikar: విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్.. అసలు కారణమేంటో?

బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకున్నారట. ఇషా కొప్పికర్.. ఒకప్పటి ఇండియన్ మోడల్, హీరోయిన్, రాజకీయవేత్త. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటింటి మెప్పించింది. ఇక టాలీవుడ్ లో ఇషా కొప్పికర్ నాగార్జున హీరోగా వచ్చిన చంద్రలేఖ, వెంకటేష్ తో ప్రేమతో రా లాంటి చిత్రాల్లో మెరిసింది.

Also read: Prabhas: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న ప్రభాస్.. సోషల్ మీడియాలో వైరల్

అయితే ఇషా 2009లో హోటల్ వ్యాపారి టిమ్మి నారంగ్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ రియానా అనే కుమార్తె కూడా ఉంది. అయితే, ఇషా.. నారంగ్ 14 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకున్నారని సమాచారం. వీరిద్దరు విడిపోవడానికి కుటుంబ కలహాలే కారణం అని తెలుస్తోంది.

ఇప్పటికే వీరి విడాకుల అప్లికేషన్ కూడా ఆమోదించబడింది. ఇదే విషయంపై ఇషా కొప్పికర్ రియాక్ట్ అవుతూ.. నేను చెప్పడానికి ఏమి లేదు.. చాలా తొందరగా జరిగిపోయింది. ఇక నా పర్సనల్ విషయాన్ని గోప్యతగా ఉంచాలని అనుకుంటున్నాను. మీరు కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నా.. అని ఇషా తెలిపింది. ప్రస్తుతం ఇషా.. భర్త నుండి విడాకులు తీసుకుని.. తన కుమార్తెతో విడిగా ఉంటుంది.

ఇషా సినిమాల విషయానికి వస్తే.. కృష్ణ కాటేజ్, డాన్, క్యా కూల్ హై హమ్ వంటి చిత్రాలలో గుర్తింపు పొందింది. ఈమె సినీ ఎంట్రీ W/o V. వర ప్రసాద్ తెలుగు సినిమా కావడం విశేషం. ఇషా రాజకీయాలల్లోనూ తనదైన పాత్ర పోషిస్తుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరి.. బీజేపీ మహిళా రవాణా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆమె నియమితులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button