తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Hyderabad: హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ రద్దు… ఎందుకో తెలుసా?

గత సంవత్సరం హైదరాబాద్ నగరంలో ఫార్ములా-ఈ స్ట్రీట్ రేస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగవలసిన రేస్ రద్దయినట్లు సమాచారం. అయితే తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 2024 ఫిబ్రవరి 10న షెడ్యూల్ చేసిన రేసింగ్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ రావడంతో రేస్ నిర్వహించడం కష్టమని నిర్వాహకులు తేల్చినట్లు తెలుస్తుంది.

Also Read: ప్రజాపాలన దరఖాస్తు… ఎలా నింపాలో తెలియజేసే వీడియో ఇదిగోండి!

గత ప్రభుత్వ హయంలో ఫార్ములా E సంస్థ ఈ ప్రిక్స్‌, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి 30 అక్టోబర్ 2023న రేసింగ్‌కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నాయి. భారీ రేసింగ్‌కు హైదరాబాద్ నగరం కూడా ఒక హోస్ట్ సిటీగా ఉంది. అయితే 2024 ఫిబ్రవరి 10న షెడ్యూల్ చేసిన హైదరాబాద్ ఇ-ప్రిక్స్ స్టేజింగ్ జరగడం కష్టమేనని తెలుస్తోంది.

Also Read: కాంగ్రెస్‌లో చేరడం లేదు.. క్లారిటీ ఇచ్చేసిన ఈటల

ఫార్ములా ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ బృందం ఈ నెల ప్రారంభంలో తెలంగాణలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంతో సమావేశమైంది. అప్పటి నుంచి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ భారీ ఈవెంట్‌కు మరికొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. అయినా ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో ఈవెంట్ నిర్వహణపై ఈ రేసింగ్ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టోక్యో, షాంఘై, బెర్లిన్, లండన్‌లతో సహా ఇతర ప్రముఖ ప్రపంచ నగరాలలో వచ్చే ఏడాది రేసును నిర్వహించబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button