తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Vidyut: నగ్నంగా తిరిగిన ప్రముఖ హీరో.. పుట్టినరోజు నాడు వింత అలవాటు

విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి.. సమాజానికి (Society) దూరంగా కొన్నిరోజుల పాటు ప్రకృతి ఒడిలో గడిపే అలవాటు కొందరికి ఉంటుంది. బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ (Vidyut Jammwal) కూడా అదే పని చేశాడు. తన పుట్టినరోజు సందర్భంగా జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో ఎలాంటి సౌకర్యాలు లేకుండా అడవి మనిషి మాదిరి గడిపాడు. అది కూడా ఒంటిపై ఒక్క గుడ్డ ముక్క లేకుండా ఉన్నాడు. స్నానం (Bath) చేస్తూ.. వంట వండుకుంటూ.. ప్రకృతి అందాలను తిలకిస్తూ తన పుట్టినరోజును సరికొత్త పద్ధతిలో చేసుకున్నాడు. వీటికి సంబంధించిన ఫొటోలను విద్యుత్ జమ్వాల్ తన అధికారిక సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Also Read గడ్డం తీసేస్తున్నారా.. రేపు తిరుమలకు తెలంగాణ మంత్రి ఉత్తమ్

శక్తి, ఊసరవెల్లి, తుపాకీ వంటి సినిమాలతో (Movies) తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విద్యుత్ జుమ్వాల్ బాలీవుడ్ అగ్ర హీరో. అతడి స్వస్థలం జమ్మూకశ్మీర్. తాజాగా డిసెంబర్ 10 తన జన్మదినం సందర్భంగా కశ్మీర్ లోని ఓ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఒంటరిగా ఓ యోగి.. సాధు జీవిలాగా గడిపాడు. ‘14 ఏళ్ల కిందట సాధువులాగా జీవించడం నేర్చుకున్నా. తర్వాత అది ఒక అలవాటుగా మారింది. ప్రతి ఏడాది 7-10 రోజులు ఇలా బతకడం జీవితంలో భాగమైపోయింది’ విద్యుత్ జుమ్వాల్ ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. ప్రకృతి (Nature) ఒడిలో జీవించడంలోనే ఒక విలాసవంతమైన జీవితం (Luxury Life) ఉందని విద్యుత్ జుమ్వాల్ పేర్కొంటాడు. ప్రకృతిలోనే తనకు సౌకర్యంగా ఉంటుందని.. తనను తాను అన్వేషించుకోవడంలో అసలైన తృప్తి ఉందని విద్యుత్ చెబుతుంటాడు. గతంలో చాలా ఇంటర్వ్యూల్లో ఇదే విషయాన్ని చెప్పాడు.

Also Read అగ్ర హీరోలు షారూక్, అజయ్ దేవగణ్, అక్షయ్ కు భారీ షాక్

పుట్టినరోజు జరుపుకుంటున్న విద్యుత్ జుమ్వాల్ సినిమాలపరంగా (Movies) చూస్తే షేర్ సింగ్ రాణా, క్రాక్ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. 2024లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్ సినిమాలపైనే ప్రధాన దృష్టి సారించే విద్యుత్ జుమ్వాల్ విడుదలయ్యే రెండూ సినిమాలు కూడా యాక్షన్ సినిమాలే. క్రాక్ సినిమాకు అతడు నిర్మాతగా (Producer) కూడా వ్యవహరిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button