తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Boys Hostel: ఓటిటిలోకి వచ్చేస్తున్న బాయ్స్ హాస్టల్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కన్నడలో చిన్న సినిమాగా రిలీజై భారీ విజయాన్ని సాధించిన మూవీ హాస్టల్‌ హుడగరు బేకాగిద్దారే. కంటెంట్ పై నమ్మకంతో చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దర్శకుడు నితిన్‌ క్రిష్ణమూర్తి నుండి వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తెలుగులో బాయ్స్‌ హాస్టల్‌ పేరుతో విడుదల అయ్యింది. ప్రజ్వల్‌, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్‌, శ్రీవత్స, తేజస్‌ జయన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కన్నడ వర్షన్ లో రిషబ్‌ శెట్టి, రక్షిత్‌ శెట్టి, రమ్య గెస్ట్‌ రోల్స్‌ చేయగా.. తెలుగు వర్షన్ లో రిషబ్‌ శెట్టి, తరుణ్‌ భాస్కర్‌, రష్మీ గౌతమ్‌ గెస్ట్‌ రోల్స్ లో కనిపించారు.

Also read: Prasanth Varma: ప్రశాంత్ వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్.. మూవీలో స్టార్ హీరోలు

అయితే తెలుగులో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఆగస్టు 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమాల ధాటికి నిలబడలేకపోయింది. దీంతో బాయ్స్‌ హాస్టల్‌ సినిమా ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు 5 నెలల తరువాత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది ఈ మూవీ. మరి థియేటర్స్ లో పెద్దగా అలరించని ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button