తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Ritika Singh: తలైవా 170 షూటింగ్.. హీరోయిన్ కి గాయాలు

గురు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ బ్యూటీ రితికా సింగ్.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల కింగ్ ఆఫ్ కొతాలో ఐటెం సాంగ్ కూడా చేసింది. ప్రస్తుతం రితికా సింగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ క్రమంలో హీరోయిన్ రితికా సింగ్‌ గాయపడింది. చేతులపై అక్కడక్కడా గాయాలు కావడంతో రాక్తస్రావం అయినట్టు సమాచారం. ఈ విషయాన్ని తెలుపుతూ రితికా తన సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో షేర్ చేసింది. ‘‘అప్పటికే అందరూ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా నేను గాయాలపాలయ్యాను.

Also read: Nithin: శ్రీలీలపై నితిన్ కామెంట్స్.. అలా అన్నాడేంటి?

అక్కడ ఉన్న ఓ గాజు అద్దం వల్లే ఇదంతా జరిగింది. బట్, ఇట్స్ ఓకే.. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు క్షణాల్లో జరిగిపోయేవాటిని మనం ఆపలేము. నేను పట్టు కోల్పోవడం వల్లే ఇలా జరిగింది. ఈ గాయం వల్ల షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నాను. దీన్నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే సెట్స్‌లో పాల్గొంటాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రితికా సింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండమని కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button