తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Aakash: సింగర్ సునీత తనయుడు హీరోగా మూవీ… ‘సర్కారు నౌకరి’ ట్రైలర్ రిలీజ్

ఒకప్పుడు సీనియర్ హీరోల కుటుంబాల నుంచే వారసులుగా హీరోలు వచ్చేవారు. ఆ తరువాత దర్శక నిర్మాతల తనయులు కూడా హీరోలుగా పరిచయమయ్యారు. ఇక ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఇతర విభాగాల నుంచి కూడా హీరోలు రావడం మొదలైంది. అలా గాయని సునీత తనయుడు ఆకాశ్ కూడా హీరోగా పరిచయమవుతున్నాడు.

Also Read: ఓటిటిలోకి ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆకాశ్ తొలి సినిమాగా ‘సర్కారు నౌకరి’ సినిమా రూపొందింది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పల్లెటూరి అందాలతో..హీరోయిన్ అందమైన మాటలతో అట్ట్రాక్ట్ చేసేలా ఉంది. సర్కార్ నౌకరి చేసే అబ్బాయితో పెళ్లి కావాలని కలలు కన్న హీరోయిన్కు సర్కారోడి భార్య అయ్యాక దక్కే మర్యాదను చూపించారు డైరెక్టర్. ఊర్లో కొత్తగా వచ్చిన సర్కారు నౌకరు ఆయన పెళ్ళాం..ఏడికి బయటికి వెళ్లిన మస్త్ అనిపిస్తుంది. అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చివర్లో సర్కారు నౌకరు అంటే..సర్కారీ జీతం తీసుకోవడం కాదు సర్..ప్రజలకు సేవ చేయడం..అంటూ హీరో చెప్పే డైలగ్స్ ఎమోషనల్ గా ఉన్నాయి.

Also Read:  ఓటీటీలోకి ‘కీడా కోలా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ మూవీని లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావుకు చెందిన ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ మూవీలో తనికెళ్ల భరణి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, సూర్య, రాజేశ్వరి ముళ్లపూడి, తదితరులు ఇతర కీ రోల్ ప్లే చేశారు. శాండిల్య మ్యూజిక్ ఈ మూవీకు స్పెషల్ అసెట్ గా కనిపిస్తోంది. డైరెక్షన్,సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా గంగనమోని శేఖర్ తన క్రీయేటివిటీ ని ప్రూవ్ చేసుకోబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button