తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Family Star: ‘ఏమండి.. నేను కాలేజీకి వెళ్లాలి’.. ఆకట్టుకుంటున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ టీజర్

టాలీవుడ్ యంగ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌ పెట్ల కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్‌’. సీతారామం ఫేమ్ మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ALSO READ: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా

దేఖోరే దేఖో..

టీజర్‌ విషయానికొస్తే.. ‘దేఖోరే దేఖో.. సర్‌ నేమ్‌కు సరెండరై, ఫ్యామిలీ అంటే వీక్‌నెస్‌ ఉన్న కలియుగ రాముడిగా’ అనే పాటతో మొదలవుతోంది. అలాగే అతను వేస్తే బడ్జెట్‌ షాక్‌. ప్లాన్‌ గీస్తే ప్రాజెక్ట్‌ షేక్‌.. అంటూ టీజర్‌లో హీరో గురించి చెబుతారు. ఇక చివరిలో ‘ఏమండి.. నేను కాలేజీకి వెళ్లాలి… కొంచెం దించేస్తారా? అని మృణాల్‌ ఠాకూర్‌ అడగగా.. ‘ఒక లీటర్‌ పెట్రోల్‌ కొట్టిస్తే దించేస్తా..’ అని విజయ్‌ దేవరకొండ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించగా.. ఏప్రిల్‌ 5న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button