తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hi Nanna: ఓటీటీలోకి ‘హాయ్‌ నాన్న’… ఎప్పుడంటే?

టాలీవుడ్ స్టార్ హీరో నాని , టాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’. నాని 30 గా వ‌చ్చిన ఈ సినిమాకు శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డిసెంబ‌ర్ 07న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం అందుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమా కోసం ఎగ‌బ‌డ్డారు. తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్, హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. ఇదిలావుంటే.. థియేట‌ర్ ప్రేక్ష‌కులను అల‌రించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ రిలీజ్ కానుంది.

Also Read: సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే నంది అవార్డులు

డిసెంబర్ 7న రిలీజైన ఈ మూవీ థియేట‌ర్ల‌లో ఆడియెన్స్‌ను మెప్పించి జ‌న‌వ‌రిలో ఓటీటీ అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా ఈ సినిమా జ‌న‌వ‌రి 04 నుంచి తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. హాయ్ నాన్న థియేట‌ర్‌లో రిలీజైన‌ న‌ల‌భై రోజుల త‌ర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నెట్‌ఫ్లిక్స్‌ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నారు.

Also Read: సీఎం రేవంత్ కు నచ్చిన సలార్ సాంగ్.. వైరలవుతున్న ట్వీట్

ఈ మూవీలో నాని కూతురి పాత్రలో బేబి కైరా ఖన్నా నటించింది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి , డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మలయాళ కంపోజర్‌, హృదయం, ఖుషీ చిత్రాల‌ ఫేం హెశమ్‌ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button