తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tillu Square: స్టార్ బాయ్ బర్త్‌డే స్పెషల్‌.. ‘టిల్లు 2’ మూవీ నుంచి నయా అప్‌డేట్

టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘టిల్లు 2’. ఈ మూవీ డీజే టిల్లుకు సీక్వెల్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా, ఈ మూవీ నుంచి మేకర్స్ ఓ అప్‌డేట్ ప్రకటించారు. నేడు సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజు సంద‌ర్భంగా స్టార్ బాయ్‌ సిద్దుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ.. ఇవాళ సాయంత్రం స్టార్ బాయ్‌ సిద్దు బ‌ర్త్‌డే గ్లింప్స్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ALSO READ:  రాజకీయ ప్రవేశంపై విశాల్ కీలక ప్రకటన.. ఏమన్నారంటే?

మార్చి 29న రిలీజ్..

ఇటీవల ‘టిల్లు 2’ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు కొత్త పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో దుమ్ము లేపింది. ఇందులో సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ ట్యాక్సీలో రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్న పోస్టర్‌ ఇప్ప‌టికే టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కిస్తుండగా.. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో క‌లిసి డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సాయిసౌజ‌న్య నిర్మిస్తోంది. కాగా, రామ్‌ మిర్యాల సంగీతం అందిస్తుండగా.. ఈ మూవీ మార్చి 29న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button