తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Budget: మూడో రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. ప్రవేశపెట్టనున్న బిల్లులు ఇవే?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇవాళ ఉదయం 11:03 నిమిషాలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశపెట్టనున్నారు. అదే విధంగా వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనున్నారు. అయితే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించారు.

ALSO READ: ప్రతీ ఏటా రూ.13వేల కోట్ల నష్టం.. జగన్ కీలక వ్యాఖ్యలు

మూడు బిల్లులు ఇవే..

శాసనసభలో ప్రభుత్వం ఇవాళ మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఆర్జేయుకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్స్ అండ్ పే స్ట్రక్చర్ సవరణ బిల్లు)లను సర్కారు ప్రవేశపెట్టనుంది.

ALSO READ: అసెంబ్లీలో రచ్చరచ్చ..టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

మళ్లీ గందరగోళం..

అసెంబ్లీలో మూడో రోజు సమావేశాలు ప్రారంభమైన అనంతరం మళ్లీ గందరగోళం నెలకొంది. ఇవాళ కూడా టీడీపీ సభ్యులు స్పీకర్‌ తమ్మినేని వెల్‌లోకి దూసుకెళ్లారు. అనంతరం సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డారు. రైతు సమస్యలపై చర్చించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. కొంతమంది పేపర్లు చించి స్పీకర్‌పై వేశారు. కాగా, అంతకుముందు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button