తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: భీమిలీ సీటుపై మళ్లీ రగడ.. టీడీపీలో వర్గపోరు… తమదే సీటు అని జనసేన ప్రచారం!

అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ 175 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలని దూకుడుగా వ్యవహిరిస్తుండగా.. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులో ఇరు పార్టీల మధ్య మొదలైన వైర్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా, విశాఖ జిల్లాలోని భీమిలీ సీటు కోసం టీడీపీ, జనసేన మధ్య మూడు ముక్కలాటకు తెరలేచింది. భీమిలీ టికెట్ తమదేనని జనసేన ఇన్‌చార్జి పంచకర్ల సందీప్‌ ప్రకటించుకుంటుండగా.. ఇదే టికెట్‌పై టీడీపీ నుంచి ఇన్‌చార్జి కోరాడ రాజబాబు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

ALSO READ: సుపరిపాలనలో రాష్ట్రాలకు అవార్డులు.. ఏపీకి అరుదైన గౌరవం

ఒకరిపై మరొకరు విమర్శలు..

భీమిలీ సీటు విషయంలో జనసేన అధినేత పవన్ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై చంద్రబాబు, పవన్‌లు ఏకాభిప్రాయానికి వచ్చినా.. ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు బాహాటంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలకు కోరాడ, గంటా, పంచకర్ల వర్గాలు ఒకరి సభకు మరొకరు హాజరుకాకపోవడం గమనార్హం. మరోవైపు భీమిలీలో గంటా ఒక సర్వే చేయించుకున్నారని, ఆ సర్వేలో గంటా గెలుపు ఖాయమని రావడంతో ఇక్కడి నుంచే గంటా పోటీకి దిగేందుకు నిర్ణయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలోనే జనసేన, టీడీపీల మధ్య వార్ మొదలుకావడంతోపాటు టీడీపీలోనూ కోరాడ, గంటా రెండు వర్గీయులుగా విడిపోయారు.

ALSO READ: గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

టీడీపీకి సెంటిమెంట్..

భీమిలి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే టీడీపీ భీమిలీ నుంచి ఆరు సార్లు గెలిచింది. కేవలం మూడు సార్లు మాత్రమే.. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2019లో వైసీపీ గెలిచాయి. ఇక 2019 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో నాలుగో వంతు అనగా 24వేల ఓట్లు జనసేన అభ్యర్థికి వచ్చాయి. అదే విధంగా అంతకుముందు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం గెలవడంతో ఈ సీటు కోసం జనసేన పట్టుబడడంతోపాటు వదిలేది లేదు అని అంటోంది. 2019 ఎన్నికల్లో టీడీపీకి 92 వేల ఓట్లు రావడంతో టీడీపీ స్థానికుల నాయకులతో పాటు హై కమాండ్ కూడా ఈ సీటును సెంటిమెంట్‌గానే భావిస్తోంది. దీంతో ఈ సీటుపై ఇరు పార్టీల మధ్య రేగిన చిచ్చు ఎంతదూరం వెళ్తోందోనని పలువురు ఆందోళన నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button