తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: కుప్పం బరిలో నిలబడ్తా.. మద్దతు ఇస్తారా?

తెలుగు రాజ‌కీయాల్లో వెన్నుపోటు నాయ‌కుడిగా చంద్ర‌బాబు చిర‌స్థాయిగా నిలిచిపోయారు. సొంత మామ ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి టీడీపీ పగ్గాలు చేపట్టి మాయ‌ని మ‌చ్చ‌గా ఉండిపోయారు. అప్పటినుంచి చంద్రబాబుపై పగబట్టిన భువనేశ్వరి.. తండ్రికి వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన భర్తకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓ బహిరంగ సభలో కుప్పం నుంచి పోటీ చేస్తా అన్నట్లు సమాచారం.

ALSO READ: యూపీలో ఎస్పీతో పొత్తు ఖ‌రారు… కాంగ్రెస్ పోటీ చేసే స్థానాలు ఎన్నో తెలుసా?

ఎత్తులు పైఎత్తులు

రాజకీయాల చదరంగంలో ఎన్నో ఎత్తులు పైఎత్తులు ఉంటాయి. గెలుపు కోసం, అధికారం కోసం సొంత కుటుంబ సభ్యులు వచ్చినా.. వెన్నుపోటు పోవడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి లక్షణాలు ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. కుప్పంలో 35 ఏళ్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకు రెస్ట్‌ ఇచ్చి.. తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు నారా భువనేశ్వరి ప్రకటించడంతో రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. దీంతో ఓటమి ఖాయమని భయపడినట్లు తెలుస్తోంది.

ALSO READ: ఓ రాజకీయ సభకు పన్నెండు లక్షల మంది.. తమిళనాటా ‘సిద్ధం’ వైరల్!

భువనేశ్వరీ ఏమన్నారంటే..

కుప్పంకు వచ్చాను.. నా మనసులో ఎప్పటి నుంచో ఒకటి ఉంది. 35ఏళ్లుగా చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు రెస్ట్‌ తీసుకోమని చెబుతున్నా..నేనే ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా.. నాకు మద్దతు ఇస్తారా? చంద్రబాబుగారికి మద్దతిస్తారా? అని ప్రజలను ఉద్ధేశించి అడిగారు. అయితే ఆమె సరదాగా ప్రశ్నించారా? లేదా మనసులో ఉన్న మాట చెప్పారా? అనే విషయాలపై తెలియాల్సి ఉంది. అయితే, చివరిలో ఇది తాను సరదాగా అంటున్నానని చెప్పారు. కాగా, ఇందులో భువనేశ్వరీ చాలా స్పష్టంగా చేసిన ప్రకటన ఏంటంటే చంద్రబాబుకు విశ్రాంతి అవసరమని చెప్పిన ఆమె ఎందుకిలా మాట్లాడారో ఎవరికి అర్థం కానీ ప్రశ్నగా మిగిలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button