తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Prabhas- Boyapati: ప్రభాస్- బోయపాటి కాంబోలో మూవీ?.. వైరలవుతున్న న్యూస్

పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు మరో మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. వీటిలో కల్కి, రాజాసాబ్ చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటూ ఉన్నాయి. ఈ చిత్రాలు పూర్తికాగానే సలార్ 2, స్పిరిట్ సినిమాలు మొదలు కానున్నాయి. ఆ సినిమాలు ఇంకా మొదలు కాలేదు కానీ ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Also read: Nikhil Siddhartha: తండ్రి అయిన టాలీవుడ్ హీరో.. ఫ్యాన్స్ విషెస్

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శీను డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ అండ్ బోయపాటి మధ్య సినిమాపై చర్చలు జరుగుతున్నాయని, అవి సఫలం అయితే.. ఇద్దరి కాంబోలో అదిరిపోయే మాస్ సినిమా ఆడియన్స్ ముందుకు రానుందని తెలుస్తుంది. ఈ కాంబో పై ప్రభాస్ అభిమానులు కూడా ఈ కాంబోలో సినిమా కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. మాస్ మసాలా సినిమా వస్తుందని ఆశ పడుతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం బోయపాటి గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ లో హీరో.. అల్లు అర్జున్, సూర్య, విజయ్ దేవరకొండ అంటూ పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఏ హీరోతో సినిమాను ఫైనల్ చేస్తారో చూడాలి. ప్రభాస్ నటిస్తున్న కల్కి విషయానికి వస్తే.. టీజర్‌ని మార్చిలో, ట్రైలర్‌ని ఏప్రిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మూవీ డబ్బింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. త్వరగా షూటింగ్ పూర్తి చేసి మే 9 న మూవీని విడుదల చేయాలని మూవీ టీం భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button