తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: ఓ రాజకీయ సభకు పన్నెండు లక్షల మంది.. తమిళనాటా ‘సిద్ధం’ వైరల్!

సీఎం వైఎస్‌ జగన్‌ ‘సిద్ధం’ పేరుతో మూడు ప్రాంతాల్లో మూడు సభలు నిర్వహించారు. ఈ సభలు అన్నీ కూడా లక్షలాది మంది వైసీపీ క్యాడర్‌తో నిండిపోయాయి. ఈ సభ నుంచి ఎన్నికల సమరానికి క్యాడర్‌ను సిద్ధం చేస్తూ.. సమరశంఖం పూరించిన వైఎస్‌ జగన్‌.. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిలా పోరాడుతున్న తనకు.. అండగా నిలవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఏలూరులోని దెందులూరు ‘సిద్దం’ సభలో ‘మళ్లీ చారిత్రక విజయానికి మీరంతా సిద్దమా..? అంటూ ప్రశ్న వేయగా.. సభ రణనినాదంగా మార్మోగింది. ఇటీవల జరిగిన అనంతపురం జిల్లాలోని రాప్తాడు సభ అంతకుమించి సూపర్‌ సక్సెస్‌ అయింది. ఈ సభకు సుమారు పన్నెండు లక్షల మంది జనం వచ్చినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

ALSO READ: బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహ.. ఉనికి కోసమేనా?

తమిళ మీడియాలో పదేపదే ప్రచారం..

రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు సంబంధించిన వార్తలు తమిళనాడు మీడియాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ సభకు సుమారు పన్నెండు లక్షలమంది తరలిరావడంతో సభ ప్రాంగణమంతా జనసందోహంగా మారింది. ఈ దృశ్యాలను అక్కడి ప్రముఖ వార్త పత్రికలతోపాటు టీవీల్లో నేటివరకు పదేపదే చూపించాయి. కాగా, సీఎం వైఎస్ జగన్ అమలుచేస్తున్న నవరత్నాలకు తమిళనాడులో మొదటి నుంచి ప్రాధాన్యం ఉందని, దీనికి సంబంధించిన వార్తలు నిత్యం మీడియాలో ప్రచురితం అవుతుంటాయని సమాచారం.

ALSO READ: విశాఖలో సీఎం జగన్ పర్యటన.. శారదా పీఠంలో పూజలు

సీఎం..నినాదాలతో పోస్ట్‌లు..

నవరత్నాలతోపాటు మహిళా సంక్షేమం, అభివృద్ధి సంబంధించిన కథనాలు, వార్తలకు తమిళ మీడియాలో ప్రముఖంగా చోటు కల్పించడంతో తెలుగు వారే కాకుండా తమిళులూ వైఎస్ జగన్‌కు అభిమానులుగా మారారు. దీంతో సోషల్ మీడియాల్లో కూడా తమకూ ఇలాంటి సీఎం కావాలన్న నినాదాలతో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పుదియ తలైమరై, సన్ న్యూస్, పాలిమర్ వంటి తదితర చానళ్లు.. రాప్తాడు జన సునామీని కళ్లకు కట్టినట్లు చూపించసాగాయి. కాగా, ఓ రాజకీయ సభకు పన్నెండు లక్షల మంది ప్రజలు రావడం ఇదే తొలిసారి అంటూ పుదియ తలైమరై కితాబు ఇచ్చింది. దీంతోపాటు దినకరన్ వార్తా పత్రికలో సిద్ధం సభ జనసందోహం ఫొటోతో ప్రచురితం చేసింది. ఇదే కాకుండా యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో సభ వీడియోలు వైరల్ అయ్యాయి.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button