తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: వ్యూహాత్మక ప్రణాళికలు.. ‘అనంత వైసీపీ’లో పోటీ చేసేది వీళ్లే?

వచ్చే ఎన్నికల్లో ‘వైనాట్ 175’ నినాదంతో సీఎం జగన్ వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లోనూ మార్పులు చేయడంతోపాటు కొన్ని స్థానాల అభ్యర్థులను తొలగించేందుకు సిద్ధమైయ్యారు. దీంతో ఎవరికి టికెట్ కేటాయిస్తారో అనే దానిపై కీలక నేతలు, వారి అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. తాజాగా, వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు, చేర్పులు కన్ఫామ్ అంటూ వస్తున్న వార్తలు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అలజడి రేపుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ వైసీపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వీరిలో కొంతమందికే వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి అనంతపురం పరిధిలో పలు స్థానాల్లో మార్పులు ఉండొచ్చనే సమాచారం ఎమ్మెల్యేలకు చెమటలు పట్టిస్తోంది.

ALSO READ: అంగన్ వాడీ కార్యకర్తలకు హెచ్చరిస్తూనే ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి

ముందస్తుగా వైసీపీ అప్రమత్తం..

ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీ కంచుకోట. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు కోసం వైసీపీ అధిష్టానం ముందస్తుగా అప్రమత్తమవుతోంది. ఈ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. కాగా, హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఓ కొత్త మహిళ నేతకు సీఎం అవకాశం కల్పించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకే హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బోయ శాంత, అనంతపురం ఎంపీ అభ్యర్థిగా శంకర్ నారాయణలను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. అదే విధంగా కళ్యాణదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి లేదా కృష్ణ మూర్తి, పెనుకొండ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉషశ్రీ చరణ్ బరిలో ఉంటుండగా.. రాయదుర్గం నుంచి రంగయ్య లేదా మెట్టు గోవింద్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ALSO READ: మళ్లీ వైసీపీలోకి వంగవీటి ఫ్యామిలీ.. వ్యూహం అదేనా?

సిట్టింగుల‌కు టికెట్ ద‌క్క‌ద‌నే ప్ర‌చారం

ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో పలు ఎమ్మెల్యేల పేర్లు గల్లంతు జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు స్థానాల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మరికొంతమంది సిట్టింగుల‌కు ఈసారి టికెట్ ద‌క్క‌ద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అంతకుముందు అసెంబ్లీ స‌భ్యుల కోటాలో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ప్పుడు సైతం న‌లుగురు ఎమ్మెల్యేల‌పై వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో పలు నియోజకవర్గాల్లో చేస్తున్న ఈ మార్పులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అంటూ అధికార పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button