తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: జన సునామీ..ముగిసిన సీఎం జగన్ ఎన్నికల ప్రచారం!

వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు పిఠాపురం రోడ్ షోతో ముగిసింది. జనవరి 28న ‘సిద్ధం’ సభలతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన వైసీపీ అధినేత మూడు విడతలుగా ప్రచారం చేశారు. ‘సిద్ధం’ సభలతో పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అనంతరం బస్సుయాత్ర చేపట్టి ‘మేమంతా సిద్ధం’ సభలు నిర్వహించారు. తర్వాత అసెంబ్లీ నియోజక వర్గాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారం సాగించారు. కాగా, ఇవాళ ఉదయం నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్‌ సెంటర్‌లో జరిగే సభలో ప్రసంగించిన జగన్.. ఆ తర్వాత మధ్యాహ్నం ఏలూరు జిల్లా కైకలూరుతోపాటు పిఠాపురంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.

ALSO READ:  ఓటమి భయంలో టీడీపీ కూటమి!

పిఠాపురంపై ప్రత్యేక దృష్టి

వైసీపీ మొదటి నుంచి పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో ఆయనపై అదే సామాజికవర్గానికి చెందిన వంగా గీతను బరిలోకి దింపిన వైసీపీ.. పవన్ కల్యాణ్‌‌ను టార్గెట్ చేస్తూ జగన్ ప్రసంగించారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న దత్త పుత్రుడికి ఓటు వేయకూడదో మీ బిడ్డ జగన్ చెబుతాడు. మహిళలు దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా..? ఐదేళ్లకొకసారి భార్యలను మార్చే ఈ దత్త పుత్రుడు.. ఎమ్మెల్యే అయితే కలిసే పరిస్థితి ఉంటుందా..? అని ప్రశ్నించారు. దత్తపుత్రుడికి ఓటు వేస్తే.. పిఠాపురంలో ఉంటాడా..? అని అడుగుతున్నా. జలుబు చేస్తే.. హైదరాబాద్ కి వెళ్లిపోయాడు. గాజువాక, భీమవరం, ఇప్పుడు పిఠాపురం వచ్చింది. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే.. న్యాయం జరుగుతుందా..? అని ప్రశ్నించారు.

ALSO READ: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు మళ్లీ అడ్డుపడిన చంద్రబాబు!

డిప్యూటీ సీఎం చేస్తానని హామీ..

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత.. నా తల్లి, అక్క లాంటి ఆమెను గెలిపించండి అని సీఎం జగన్ కోరారు. వంగా గీతను గెలిపిస్తే.. డిప్యూటీ సీఎం చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అంతకుముందు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో నిర్వహించిన రోడ్డు షోలో సీఎం జగన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పని చేయలేడు అనడం లేదు..పని చేసే అవకాశం లేదు అంటున్నాను. నేను పని చేసినందుకు నన్ను నిలదీయాలా? పవన్ కళ్యాణ్ చెప్పాలి. నాకు జ్వరం వస్తే నేను హైదరాబాద్ పారిపోలేదు. ఆడవాళ్లు కాబట్టి నన్ను ప్రశ్నించాలా? నన్ను అవమానిస్తారా? అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button