తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: జనసేనకు ఊహించని షాక్.. అచ్యుతాపురం ఇంటిని ఖాళీచేసిన నాగబాబు!

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురంలో నివాసం ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ఇటీవల ఆయన తెగ హడావిడి చేశారు. అయితే ఎన్నికల కార్యకలాపాలన్నీ అచ్యుతాపురం కేంద్రంగా నిర్వహించాలనుకున్న నాగబాబు.. సడెన్‌గా హైదరాబాద్ ఎందుకు చేరుకున్నారనేది రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

ALSO READ: మేదరమెట్ల ‘సిద్ధం’ సభకు ఏర్పాట్లు..వైసీపీ మేనిఫెస్టోపై ఉత్కంఠ‌!

ఓటమి భయమే కారణమా?

అనకాపల్లిలో టీడీపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పోటీ పోటీ చేద్దామని అనుకున్న నాగబాబు.. ఎన్నికలకు ముందే అనకాపల్లి నుంచి తట్టాబుట్టా సర్దుకుని హైదరాబాద్ షిప్ట్ అయ్యారు. అయితే ఇటీవల ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందనే విషయంపై సర్వే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఏడు రోజులపాటు నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహించిన తర్వాత అసలు విషయం తెలిసిందట. వైసీపీ గతంలో కంటే వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించే అవకాశం ఉందని తేలిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి నుంచి పోటీ చేసే ఆలోచనను విరమించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ALSO READ: మరోసారి వారణాసి నుంచే ప్రధాని మోదీ పోటీ.. బీజేపీ తొలి జాబితా రిలీజ్

వార్ వన్ సైడ్..

టీడీపీ, జనసేన ఉమ్మడి టికెట్ల ప్రకటన తర్వాత కేడర్‌లో అసమ్మతి ఏర్పడిందని వినిపిస్తోంది. ఒకవైపు టికెట్ ఆశించిన వారి నుంచి భంగపాటు ఎదురవుతుండగా.. మరోవైపు టికెట్ మాకే కావాలని వ్యతిరేకత కూడా ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ధోరణి ఏర్పడడంతో వైసీపీకి అనుకూలంగా మారిందని తెలుస్తోంది. తాజాగా, అనకాపల్లిలో జనసేనకు ఊహించని షాక్ ఎదురైంది. గత ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాల్లో గెలిచిన వైసీపీ.. ఈ ఐదేళ్లల్లో పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలతో బలపడంది. దీంతో రానున్న ఎన్నికల్లోనూ వైసీపీ హవా కొనసాగనుందని నాగబాబు చేయించుకున్న సర్వేల్లో వెల్లడి కావడంతో ఆయన అక్కడి నుంచి పరారైనట్లు జోరుగా చర్చలు మొదలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button