తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: వ్యూహం మార్చిన వైసీపీ..మంగళగిరిలో లోకేష్‌పై అభ్యర్థి ఎవరంటే?

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మార్పులు చేస్తున్న అధికార వైసీపీ మరో ముందడుగు వేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ తొమ్మిదో లిస్ట్‌ను రిలీజ్‌ చేయగా.. ఇందులో మంగళగిరి నుంచి చిరంజీవి పేరు కాకుండా కొత్త అభ్యర్థి పేరును ప్రకటించింది. కాగా, మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది.

ALSO READ: సీఎం జగన్ మాస్టర్ ప్లాన్.. పవన్ పై పోటీకి సీనియర్ నేత?

లావణ్య పేరు ఖరారు..

గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్.. 2024 ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీ చేయనున్నారు. అయితే 2019 ఎన్నికల్లో లోకేష్‌పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడి.. మళ్లీ వైసీపీలోకి వచ్చారు. ఈ తరుణంలో ఆ సీటును గంజి చిరంజీవికి కేటాయించిన వైసీసీ.. మళ్లీ వ్యూహం మార్చింది. తాజాగా, వైసీపీ ప్రకటించిన జాబితాలో మంగళగిరి నుంచి చిరంజీవి పేరు కాకుండా లావణ్య పేరును ప్రకటించింది. కాగా, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు అయిన లావణ్య పేరు ప్రకటించడం గెలుపుపై ప్రభావం చూపనుంది.

ALSO READ: వైసీపీ తొమ్మిదో జాబితా విడుదల.. ప్రత్యక్ష ఎన్నికల్లోకి విజయసాయిరెడ్డి!

లోకేష్ ఓటమే లక్ష్యం..

వచ్చే ఎన్నికల్లో లోకేష్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ కసరత్తు చేస్తోంది. గతంలో మాదిరిగా ఈసారి కూడా లోకేష్‌ను అసెంబ్లీలో అడుగుపెట్టనివద్దనే ఉద్దేశంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా లావణ్య పేరు తెరపైకి రావడం మంగళగిరిలోని కొందరు నేతల్లో అలజడి రేపుతోంది. మరి, కీలక నియోజికవర్గమైన మంగళగిరిలో అభ్యర్థి మార్పు ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button