తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CBN: వాలంటీర్ వ్యవస్థను రూపుమాపేందుకు చంద్రబాబు మరో కుట్ర!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వాలంటీర్ వ్యవస్థపై ముందు నుంచి విషం కక్కుతున్న ఆయన.. ఈ దిశగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. ఓ వైపు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు రూ. 10 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెబుతూనే, మరోవైపు, తెర వెనుక మాత్రం ఆ వ్యవస్థనే లేకుండా వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం.

ALSO READ: తీరు మార్చుకోని చంద్రబాబు.. పెన్షన్‌దారులకు తప్పని ఇబ్బందులు!

వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పెన్షన్లు అందించాల్సిన అవసరమే లేదని, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీలు పెన్షన్లు పంపిణీ చేయొచ్చొని చంద్రబాబు ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. రాష్ట్రంలో 15 వేల మంది పంచాయతీ సిబ్బంది, 5 వేల మంది ‘వెలుగు’ ఉద్యోగులు, 3 వేల మంది హార్టికల్చర్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారని, వీరి చేత పెన్షన్లు పంపిణీ చేయడం చాలా సులభమని అన్నారు. అంతేకాదు, ఇది ఎలాగో తాను అధికారంలోకి వచ్చాక అమలు చేసి చూపిస్తానని కూడా అన్నారు.

ALSO READ: కూటమిలో లుకలుకలు.. ఉమ్మడి మేనిఫెస్టో వేదికపై కనిపించని మోదీ ఫోటో!

రూ. 10 వేలు ఇస్తామన్నా బాబును నమ్మని వాలంటీర్లు!

చంద్రబాబు మాటల్ని బట్టి రానున్న ఎన్నికల్లో ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే, చంద్రబాబు మొట్టమొదట చేసేది వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడమే అని అర్థం చేసుకోవాలి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఏ వాలంటీర్ కూడా చంద్రబాబు మాయమాటల్ని నమ్మడం లేదు. తాము అధికారంలోకి వస్తే నెలకు రూ. 10 వేలు ఇస్తామని చెబుతున్నా ఏ ఒక్క వాలంటీర్ కూడా పట్టించుకోవడం లేదు. వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి తమకు ఉద్యోగాలు కల్పించి, తమ జీవితాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్ రెడ్డికే వాలంటీర్లు మద్దతు పలుకుతున్నారు. జగన్ ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లందరూ రాజీనామాలు కూడా చేస్తున్నారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీనామా చేసిన వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకునే ఫైల్ మీదే మొదటి సంతకం చేస్తానని వారికి సీఎం జగన్ హామీనిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button