తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pensions: తీరు మార్చుకోని చంద్రబాబు.. పెన్షన్‌దారులకు తప్పని ఇబ్బందులు!

వృద్ధులు, వికలాంగులు, వితంతువులపై చంద్రబాబు నిజంగానే కక్షకట్టారు. వాలంటీర్ల మీద, సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో పెన్షన్ లబ్ధిదారుల మీద ఆయన కక్షతీర్చుకుంటున్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థను సమూలంగా లేకుండా చేయాలన్నదే ఆయన లక్ష్యం.. అవును, నిజమే.. ఈ వ్యాఖ్యలకు చంద్రబాబు చర్యలు, జరుగుతున్న పరిణామాలు బలాన్ని చేకూరుస్తున్నాయి కూడా. వాలంటీర్ల చేత సజావుగా జరుగుతున్న పెన్షన్ల పంపిణీని ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకున్న చంద్రబాబు.. ఇప్పుడు జగన్ కట్టించిన సచివాలయాల్లోనూ పెన్షన్ డబ్బులు అందించకుండా తనకున్న బీజేపీ మద్దతుతో ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి ఉత్తర్వులిచ్చేలా చేశారు.

ALSO READ: భారీగా పడిపోతున్న టీడీపీ గ్రాఫ్!

80 శాతం మందికి బ్యాంకుల్లోనే పెన్షన్ జమ

ఈసీ తాజా నిర్ణయం ప్రకారం కేవలం కొంత మందికి తప్ప 80 శాతం మందికి పెన్షన్ నగదును బ్యాంకుల్లోనే జమ చేయనున్నారు. అయితే, పెన్షన్ నగదును బ్యాంకుల్లో జమ చేస్తే వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అసలే ఎండాకాలం, పైగా వడగాలులు కూడా వీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వృద్ధులు, వికలాంగులు బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లి నగదు విత్ డ్రా చేసుకోవడం ఎంతో ఇబ్బంది. పైగా ఏ బ్యాంక్ అయినా మండల కేంద్రంలోనే ఉంటుంది తప్ప గ్రామాల్లో ఉండదు. కాబట్టి బస్సు లేదా ఆటోల్లో వెళ్లాలి. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచిస్తోంది. కానీ చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం అవ్వాతాతలను మళ్లీ ఇబ్బంది పెడుతున్నారు.

ALSO READ: గత పథకాలకు మళ్లీ చోటు.. మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్!

చంద్రబాబు కుట్ర ప్రజలకు తేటతెల్లం!

టీడీపీ నిర్వాకంతో గత నెల వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం ఎండలో సచివాలయాల ముందు క్యూ లైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడ్డారు, తమని కష్టాల పాలు చేసిన చంద్రబాబును, కూటమి నేతల్ని వృద్ధులు చెడామడా తిట్టుకున్నారు. దీంతో కూటమి నేతలు మరో కొత్త గేమ్‌కి తెరలేపారు. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీని ఉన్నతాధికారులు కావాలనే ఆపేశారని ఆరోపించారు. ఇప్పుడు కూడా పెన్షన్ పంపిణీకి సమయం దగ్గరపడటంతో మరోసారి కొత్త డ్రామా మొదలుపెట్టారు. పెన్షన్ల పంపిణీ ఇంటివద్దే జరగాలని వారు సీఎస్‌కి ఏదో మొక్కుబడిగా వినతిపత్రం అందించారు. కానీ పెన్షన్ల పంపిణీపై ఇప్పటికే ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు కుట్రలు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యాయి. పెన్షన్ పాపం కచ్చితంగా టీడీపీ ఖాతాలోనే పడిపోయింది.

సంబంధిత కథనాలు

Back to top button