తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

Janasena: ‘గాజు గ్లాసు’ గుర్తును ఫ్రీ సింబల్‌గా ప్రకటించిన ఈసీ

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి విలన్ ఎక్కడో లేరు, ఎవరో కాదు. గాజు గ్లాస్ రూపంలో ఆ విలన్ కూటమిని పట్టి పీడిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ‘గాజు గ్లాసు’ గుర్తును ఫ్రీ సింబల్‌గా ప్రకటించింది. ఫ్రీ సింబ‌ల్‌గా ఉంచిన గాజుగ్లాసు గుర్తును… జ‌న‌సేన బ‌రిలో లేని చోట స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు ఎన్నిక‌ల అధికారులు కేటాయించారు. దీంతో ఇండిపెండెంట్ అభ్య‌ర్థులంద‌రూ ఫ్రీ సింబ‌ల్‌గా ఉంచిన జ‌న‌సేన గుర్తు గాజు గ్లాసుపై కన్నేశారు. ఈ పరిణామంతో కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ALSO READ: తీరు మార్చుకోని చంద్రబాబు.. పెన్షన్‌దారులకు తప్పని ఇబ్బందులు!

టీడీపీ, జనసేన ఓట్లకు గండి!

పోలింగ్ వేళ ఓటర్లు ఈ గుర్తు విషయంలో అయోమయంలో పడే ఛాన్స్ ఉంది. జనసేన పోటీ చేయని చోట, టీడీపీనో లేదా బీజేపీనో పోటీ చేస్తుంది. అక్కడ స్వతంత్ర అభ్యర్థికి ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయిస్తే, జనసేన కూడా పోటీ చేస్తుందని భావించి నిరక్షరాస్యులైన ఓటర్లు ఆ గుర్తుకే ఓటేసే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో తప్పితే ప్రతి చోట ఎవరో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గాజు గ్లాసు గుర్తును ఎంచుకునే వీలుంది. దీంతో అటువంటి చోట్ల కూటమి ఓట్లు చీలిపోవడం ఖాయం.

ALSO READ: భారీగా పడిపోతున్న టీడీపీ గ్రాఫ్!

ఈసీపై కూటమి నేతల మండిపాటు!

మూడు పార్టీలు క‌లిసి కూట‌మిగా ముందుకెళుతున్నాయ‌ని, ఫ్రీ సింబ‌ల్‌గా ఉంచిన గాజుగ్లాసు గుర్తును జ‌న‌సేన‌కు మిన‌హాయించి మ‌రే ఇత‌ర పార్టీలు, ఇండిపెండెంట్‌ల‌కు కేటాయించొద్ద‌ని ప‌లుమార్లు రాష్ట్ర‌, కేంద్ర ఎన్నిక‌ల అధికారుల‌కు కూటమి నేత‌లు విన్న‌వించుకున్నారు. కానీ ఈ విషయంలో వారికి ఊహించని పరిణామం ఎదురైంది. ఎన్నిక‌ల అధికారులకు ఎంత‌గా చెప్పినా, వారు ఏ మాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏంట‌ని కూట‌మి నేత‌లు నిల‌దీస్తున్నారు. మరోసారి ఈసీని ఆశ్రయించి.. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో కాకుండా మిగిలిన ఎక్కడా అసలు గాజు గ్లాసు గుర్తు అందబాటులో లేకుండా కోరాలని కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button