తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Janasena: జనసేనానికి లేని సొంత అజెండా.. ఎన్నాళ్లింకా పరుల చెంతా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి చూస్తుంటే.. ఏపీ ప్రజలకు ఎమనాలో కూడా తెలియని పరిస్థితి. రాజకీయాల్లో ఏదో సాధిస్తామని చెప్తూ.. పార్టీ పెట్టిన పెద్దమనిషి.. ఇప్పుడు కనీసం పార్టీని సొంతంగా పోటీలో నిలబెట్టలేని పరిస్థితుల్లో ఉండి పోయారు. దీనిపై ఏపీ ప్రజలు, జనసైనికులే ఆయనకు సొంత అజెండా ఏం లేదని.. ఇంకా ఎన్నిరోజులు పక్క పార్టీలకు వంత పాడతారని కామెంట్స్ చేస్తున్నారు.

పార్టీని పెట్టిన తర్వాత 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా.. టీడీపీ సపోర్ట్ చేశారు. అవసరానికి వాడుకుని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. పవన్ కల్యాణ్ ను వదిలేశారు. అనంతరం 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం ఏమో కానీ.. ఆయనే పోటిచేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఇక కాలక్రమేణా బీజేపీతో దోస్తీ కట్టారు. ఆ స్నేహబంధంతోనే తెలంగాణలో పోటీచేసినా.. అక్కడి ప్రజలు కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వలేదు.

Also read: Minister Kakani: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్.. ఫోటోలకు పోజులు ఇస్తారని ఎద్దేవా

ఇక త్వరలో రాబోయే ఎన్నికల్లో పోటీచేసేందుకు మళ్లీ టీడీపీతో జతకడుతున్నారు. మరి రాష్ట్రానికి ఏదో చేయాలని వచ్చిన పవన్ టిడిపితో పొత్తు పెట్టుకుంటే.. మరి సీఎం పదవి రేసులో లేనట్టేనని పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చారట. దీనిపై జనసైనికులు కూడా ఒకింత అసంతృప్తితో ఉన్నారట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం అనంతరం బుధవారం హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్‌ భేటీ జరిగింది. ఆ భేటీలో ఏమి చర్చించారో ఎవరికీ తెలియదు.. కానీ మరుసటి రోజే తాను సీఎం పదవిని కోరుకోవడంలేదని పవన్‌ విశాఖపట్నంలో జరిగిన సభలో పార్టీ శ్రేణులందరికీ స్పష్టమైన సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు తప్పదని స్పష్టం చేశారు.

జనసైనికులు టీడీపీని గెలిపించడమేంటి?

జనసేన పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలవడంతో పాటు మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీని కూడా గెలిపించాలని చెప్పారు. సీఎం పదవిపై తాను, బాబు మాట్లాడుకుంటామని అన్నారు. అవసరమైతే తనను తాను తగ్గించకుంటానని కూడా చెప్పారు. దీనిపై జనసైనికులు పొత్తులో జనసేన పోటీ చేసిన స్థానాల్లో గెలవడం పక్కనపెడితే.. మిగిలిన స్థానాల్లో టీడీపీని జనసేనే గెలిపించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పొత్తుల చరిత్ర పరిశీలిస్తే.. మిత్రపక్షాలనే మోసం చేస్తారన్నది సుస్పష్టమని జనసేన నేతలు చెబుతున్నారు. పొత్తు పెట్టుకున్న పార్టీలకు చంద్రబాబు ఇచ్చేదే అరకొర సీట్లేనని, అక్కడ కూడా ఏదో ఒక వ్యూహం పన్ని ఓటమిని పొత్తులో ఉండే పార్టీపై వేస్తారని అనుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్కువ సీట్లు దక్కించుకున్న జనసేనకు ప్రాధాన్యం ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

Also read: BJP MLA: వైఎస్ఆర్ దేవుడన్న బీజేపీ ఎమ్మెల్యే.. వైరలవుతున్న వీడియో

సొంత అజెండా లేని జనసేనాని

జనసేన పార్టీ ఏర్పాటు నుంచీ సొంత పార్టీ ప్రయోజనాలకన్నా, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకే పవన్ కష్టపడుతున్నారని అంతా అనుకుంటున్నారు.. అందుకు నిదర్శనంగా ఎన్నోమార్లు పవన్‌ టీడీపీకి వంతపాడేలా వ్యాఖ్యలు చేశారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన – టీడీపీతో పొత్తుపై చర్చ మొదలైనప్పుడు, పవన్‌కు కూడా సీఎం పదవిని కేటాయించాలని టీడీపీని కోరాలని పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినా.. పవన్ మాత్రం పొంతన లేని సమాధానాలు చెప్తూ.. కాలం దాటవేస్తున్నారు. దీంతో అసలు జనసేనాని మనసులో ఏముందనే విషయం అర్థంకాక జనసైనికులు తలలు పట్టుకుంటున్నారు. అసలు టీడీపీ కోరకముందే పొత్తుకు పవన్‌ సిద్ధపడటం, జనసేనకు కేటాయించే సీట్లు ప్రాధాన్యతే కాదన్నట్టు మాట్లాడుతున్న తమ అధినేతను చూసి ఆయనకు ఇంకా ఎన్నాళ్లు పక్క పార్టీలకు వంత పాడతారని చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button