తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Minister Nirmala Sitharaman: ఏపీ అప్పులపై కేంద్రం క్లారిటీ.. టీడీపీ కంటే వైసీపీ అప్పులే తక్కువ

ఏపీలో వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందని టీడీపీ, జనసేన చేస్తున్న తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఆ ప్రచారం అంతా అబద్దమనే విషయం తెలిసిపోయింది. ఒకసారి ఓ విధంగా, మరోసారి ఇంకోలా లెక్కలు మార్చి చేస్తున్న అసత్య ప్రచారాలపై ప్రభుత్వం స్పందిస్తున్నా.. విపక్షాల తీరు మారటం లేదు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన విషయాలతో విపక్షాల నోటికి తాళం పడినట్టు అయింది. టీడీపీ హయాంతో పోలిస్తే ప్రస్తుత వైసిపి పాలన మెరుగ్గా ఉందని.. పరిమితులకు లోబడే వైసిపి అప్పులు తీసుకుందని.. టీడీపీ కంటే ఇది తక్కువని వెల్లడించారు.

Also read: Prashant Kishor: మాట మీద నిలబడని ప్రశాంత్ కిషోర్.. నైతిక విలువలు లేవా?

అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన అప్పులు రూ.1,77,991 కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. 2019 నాటికి ఏపీకి రూ.2,64,451 కోట్లు అప్పులుండగా 2023 మార్చి నాటికి రూ.4,42, 442 కోట్లకు చేరినట్లు తెలిపారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అసెస్‌ చేస్తోందా? 2019 మే నుంచి ఏపీ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది? ఆర్థిక పరిస్థితిని అంచనా వేశారా?..’’ అంటూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనల మేరకు వ్యవహరిస్తోందని తేల్చి చెప్పారు. ద్రవ్యలోటు తగ్గింపు, వివేకంతో కూడిన రుణ నిర్వహణ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల్లో సుస్థిరత, పారదర్శకతను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎంను అసెంబ్లీ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయని వెల్లడించారు. ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సులను, ఆర్ధిక పరిమితులను అమలు చేస్తున్నారా.. లేదా? అనే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన వ్యయ విభాగం పరిశీలన చేస్తూ ఉంటుందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button