తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: జనసేనాని కీలక వ్యాఖ్యలు.. సీట్ల కేటాయింపులో తగ్గేది లేదన్న పవన్

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ నేతలు అభ్యర్థుల ఎంపిక, వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్ని సీట్లు తీసుకోవాలో జనసేనాని పవన్ కల్యాణ్ కు కొందరు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని.. అది తెలియకుండానే ఇక్కడ వరకు వచ్చానా? అని ప్రశ్నించారు.

Also read: Asaduddin Owaisi: జ్ఞానవాపి మసీదుపై బయటపడ్డ కీలక విషయాలు.. పురావస్తుశాఖపై అసదుద్దీన్ ఓవైసీ ఫైర్

చంద్రబాబు లాగానే తనపై కూడా ఒత్తిడి ఉందని.. సీట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తప్పకుండా పొత్తులో భాగంగా మూడో వంతు సీట్లను మనం తీసుకుంటున్నామని వెల్లడించారు. అందులో భాగంగానే ఒత్తిడి కొంతైనా తగ్గించేందుకు రాజాం, రాజనగరం అభ్యర్థులను ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అర్థచేసుకుంటారని భాస్తున్నానని అన్నారు. కొందరు పొత్తును ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారని, అది మందిది కాదని సూచించారు. అయితే పొత్త ధర్మం పాటించాలని.. ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం మంచిపని కాదని అన్నారు.

సీఎం పదవి కోసం ఎవరూ ఆందోళన చెందొద్దని పవన్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో టీడీపీతో పొత్తు ముగియదని, భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లు తనను నమ్మండని.. ఆ తర్వాత జనసేన క్యాడర్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఏ వ్యూహం వేసినా అది తనదే బాధ్యతని.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుపుమనదేనని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button