తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: అసెంబ్లీ ఎన్నికలపై పవన్ దృష్టి.. జిల్లాల పర్యటనకు రెడీ

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పొలిటికల్ యాత్రలకు రెడీ అవుతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్. అయితే ఈసారి మూడు దశల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొత్తుల దృష్ట్యా మొదటి దశలో జనసేన, టీడీపీ లీడర్లు కేడర్‌ను సమన్వయం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండో దశలో పార్టీ ఎన్నికల వ్యూహంపై కేడర్‌కు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు మూడో దశలో ప్రచార సభల్లో ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది.

Also read: Hungary President: హంగేరిలో వెల్లువెత్తిన నిరసనలు.. అధ్యక్షురాలి రాజీనామా

ఇక పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన నేతలతో నియోజకవర్గాల వారీగా పవన్ వరుస సమావేశాలు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల కార్యాచరణను ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రారంభించబోతున్నారు. రెండు పార్టీల నేతలు క్షేత్ర స్థాయిలో కలిసి వెళ్లేలా పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య పలు నియోజకవర్గాల్లో వరుసగా వివాదాలు, విభేదాలు తెర పైకి వస్తూ ఉండడంతో.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని సమాచారం.

దీనిలో భాగంగా తొలి దశలో టీడీపీ, జనసేన పార్టీల నేతలతో భేటీ అయి వారి మధ్య గ్యాప్ లేకుండా కలిసి వెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు పవన్‌. మొదట భీమవరంలో, ఆ తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిల్లో పవన్‌ పర్యటన ఉంటుంది. గోదావరి జిల్లాల తర్వాత మిగతా ప్రాంతాల్లో పర్యటనకు కూడా వెళ్తారని, జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button