తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Masth Shades Unnai Ra: ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?

టాలీవుడ్‌లో ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అభినవ్ గోమఠం. ప్రస్తుతం ఈ నటుడు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’. ఈ సినిమాకు తిరుప‌తి రావు దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ALSO READ: ఓటీటీలోకి కింగ్ నాగార్జున మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా

టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమాలో మ‌స్తు షేడ్స్ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో అభినవ్ గోమఠం గోదావరి ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పలెటూర్‌లో ఉంటాడు. టెన్త్ తర్వాత చదువు మానేసిన అభినవ్.. ఎంత టాలెంట్ ఉన్నా ఊర్లోనే గోడలపై డిజైనింగ్స్ వేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అయితే టౌన్‌లో పెద్ద డిజైనర్ అయిన తన క్లాస్ మేట్ రేంజ్‌కు చేరుకోవాలన్న అభినవ్‌కు ఉమాదేవి పరిచయం అవుతోంది. తనకి ఆమె ఎలా సహాయం చేస్తుంది వీళ్ల లవ్ ట్రాక్ ఏంటి? అనేది ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 23న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button