తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవిత ఆశయం: చంద్రబాబు

ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్ కే ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బెంగళూరులో నిర్వహించిన టీడీపీ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. 2047 సంవత్సరానికి ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ గా ఉంటుందని చెప్పారు. రానున్న ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొనాలని చెప్పారు. మీరు సంపాదించిన దాంట్లో 5 శాతాన్ని సమాజం కోసం వినియోగించాలని తెలిపారు. తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకుంటే తన జన్మ ధన్యమైనట్టేనని చెప్పారు. తొలుత తనను గెలిపించింది విద్యార్థులేనని గుర్తుచేసుకున్నారు.

Also Read: చంద్రబాబు vs జగన్ … ఎవరి హయాంలో రోడ్ల నిర్మాణానికి పెద్దపీట

రైతు కుటుంబంలో పుట్టి.. ఐటీని ప్రోత్సహించానని… అప్పట్లో ఐటీ ఏర్పాటు చేస్తానన్నప్పుడు.. విజన్‌-2020 అని చెప్పినప్పుడు తనను హేళన చేశారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఏపీలోని అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని.. రానున్న ఎన్నికలు ఎందుకు ముఖ్యమనేది ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం చూడాలనేది తన జీవిత ఆశయమని చెప్పారు.

Also Read: సీఎం జగన్ 85 శాతం ఫెయిల్.. నవరత్నాలు నవమోసాలయ్యాయి

అంతకుముందు బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబు.. కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు త్రిలోక్‌ను పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో కుప్పంలో ఆందోళన చేస్తున్న త్రిలోక్ ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురైన త్రిలోక్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని వారికి చంద్రబాబు ధైర్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button