తెలుగు
te తెలుగు en English
జాతీయం

Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. కొత్త పార్లమెంట్ లో రాష్ట్రపతి తొలి ప్రసంగం

ప్రపంచంలోకెల్లా భారత సంస్కృతి, సభ్యత ఎంతో గొప్పదని భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అన్నారు. పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా నూతన పార్లమెంట్‌కు వచ్చారు. ఈ మేరకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త పార్లమెంట్‌లో తన తొలి ప్రసంగం ఇదేనని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్ తమ లక్ష్యమని పేర్కొన్నారు. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశం మనదేనని అన్నారు.

Also read: AP Government: ఉద్యోగాల కల్పనలో ఏపీ ముందు వరుస.. కొత్తగా మరో నోటిఫికేషన్

రానున్న రోజుల్లో అందరం కలిసికట్టుగా వికసిత్ భారత్ నిర్మిద్దామని పిలుపుచ్చారు. ఇటీవల హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో తొలిసారి వందకు పైగా పతాకాలు సాధించడం సంతోషదాయమని అన్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీతో 5జీ నెట్‌‌వర్క్ వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక, రాజకీయ సమస్యలపై చర్చించడానికి భారత్ పెద్దన్నగా వ్యవహరించిన జీ20 సమ్మిట్ విజయవంతమైందని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని దేశ వ్యాప్తంగా సంబురంగా చేసుకున్నామని తెలిపారు.

కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అభినందనీయమన్నారు. డిజిటల్ రంగంలో గోప్యతను పటిష్టం చేశామని.. 500 ఏళ్ల నాటి రామ మందిర కల సాకారమైందని, కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మకమని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో సమ్మక్క- సారక్క యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించామని, 25 కోట్ల మంది ప్రజలకు పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు. భారత్‌లో తొలిసారిగా నమో భారత్, వందే భారత్ రైళ్లను కూడా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముంబైలో ‘అటల్ సేతు’ నిర్మాణం, దేశంలో 10 లక్షల కి.మీ గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button