తెలుగు
te తెలుగు en English
జాతీయం

Sudarshan Setu: దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్… సుదర్శన్ సేత్ ప్రారంభించిన మోదీ

దేశంలోనే అతిపెద్ద కేబుల్ వంతెన సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్‌లోని ద్వారకలో ఈ వంతెన ఉంది. 2017లో ప్రధాని మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Also Read: గుడ్ న్యూస్.. ఎల్లుండి నుంచి రెండు గ్యారంటీలు అమలు

బెయిట్ ద్వీపాన్ని ఓఖ్రా పోర్టుతో కలుపుతూ ఈ వంతెనను 979 కోట్లతో నిర్మించారు. నాలుగు లేన్లు ఉన్న ఈ బ్రిడ్జి పొడవు 2.3 కిలోమీటర్లు, వెడల్పు 27.20 మీటర్లు. సుదర్శన్ సేతు ఓ ప్రత్యేకమైన డిజైన్.. భగద్గీతలోని శ్లోకాలతో అలంకరించబడిన ఫుట్ పాత్, రెండు వైపులా శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంటాయి. గతంలో సిగ్నేచర్ బ్రిడ్జ్ గా పిలువబడిన ఈ వంతెనకు సుదర్శన్ సేతు అని పేరు పెట్టారు. బేట్ ద్వారక అనేది ఓఖా పోర్ట్ సమీపంలో ఉన్న ఓ ద్వీపం. ఇది ద్వారకా పట్టణం నుంచి దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుని ప్రసిద్ధ ద్వారాదీష్ దేవాలయం ఉంది.

Also Read: రైల్వేస్టేషన్ల అభివృద్ధికి కేంద్రం శ్రీకారం.. రేపు ప్రధాని మోడీ శంకుస్థాపన

కాగా, ప్రధాని మోదీ నేడు పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఆయన రాజ్‌కోట్‌లోని (గుజరాత్) తొలి ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రారంభిస్తారు. ఆ తరువాత ఏపీ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో ఎయిమ్స్ ఆసుపత్రులను కూడా వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మొత్తం 6300 కోట్లతో ప్రభుత్వం నిర్మించింది. కాగా, గుజరాత్‌లో నేటి సాయంత్రం జరిగే రోడ్ షోలో కూడా ప్రధాని మోదీ పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button