తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Operation Valentine: వరుణ్ తేజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

మెగా హీరో వరుణ్‌తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషీ చిల్లార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ను సల్మాన్‌ఖాన్‌, రామ్‌చరణ్ రిలీజ్ చేశారు. తాజాగా, మేకర్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ప్రకటించారు. ఫిబ్రవరి 25న ఆదివారం హైదరాబాద్‌లో 6గంటలకు జరిగే ఈవెంట్‌కు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు మేకర్స్ పోస్ట్ రిలీజ్ చేశారు.

ALSO READ: గోపీచంద్ విశ్వరూపం..`భీమా` ట్రైలర్‌ రిలీజ్

యథార్థ ఘటనల ఆధారంగా ..

‘ఆపరేషన్ వాలెంటైన్’ పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్, రెనైసెన్స్ పిక్చర్స్ సంస్థలు భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఇందులో రుహాణిశర్మ, నవదీప్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక, ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో మార్చి 1న రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button