తెలుగు
te తెలుగు en English
జాతీయం

West Bengal: రాహుల్ గాంధీ కారుపై దాడి… కాంగ్రెస్ నాయకులు సీరియస్

పశ్చిమబెంగాల్ లోని మాల్దాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త నెలకొంది. అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాదోళనకు గురయ్యారు.రాహుల్ గాంధీ వ్యక్తిగత సిబ్బంది తేరుకునే లోపే ఈ దాడి జరిగిందని స్థానికులు తెలిపారు. దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపట్డారు. దాడి తర్వాత రాహుల్ కారు దిగి బస్సులో కూర్చున్నారు.

Also Read: మోదీ దేశానికి ప్రమాదకరమన్న రేవంత్… బిల్లా,రంగాలు ప్రశ్నించడంలేదని విమర్శ

మాల్దా జిల్లాలోని హరిశ్చంద్రపుర్ లో రాహుల్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిందని బెంగాల్ కాంగ్రెస్ చీప్ అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇలాంటి దాడులు కరెక్ట్ కాదన్నారు. అనంతరం ప్రజలను కాంగ్రెస్ నేతలు శాంతింపజేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రధాన రహదారుల గుండా నెమ్మదిగా సాగింది. కారు పైకప్పుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్ గాంధీ ముందుకు సాగారు.

Also Read: అధికారులకు రేవంత్ సూచనలు… తాగునీటి సమస్య తలెత్తకూడదని ఆదేశం

రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టినప్పటి నుంచి దుండగులు నిత్యం ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఇటీవల మణిపూర్ లో రాహుల్ యాత్రను అడ్డుకున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో రాహుల్ ను అడ్డుకోవడం కూడా రాజకీయ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button