తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: కేటీఆర్‌కు ఈగో వైఫైల ఉంటుంది… బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత, సినీ నటుడు బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. తండ్రి పేరు అడ్డు పెట్టుకోనే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని.. కేసీఆర్ అబ్బాయిగా తప్ప కేటీఆర్ కి ఎలాంటి గుర్తింపు లేదన్నారు. రేవంత్ రెడ్డి ఒక పోరాట యోధుడు.. చాలా అరుదుగా అలాంటి వాళ్లు ఉంటారనే విషయాన్ని మరచిపోకూడదని బండ్ల గణేష్ అన్నారు. బీఆర్ఎస్ పెట్టిన చిత్ర హింసలు, మానసిక క్షోభ అధిగమించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు.

Also Read: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త… ఒక్కొక్కరికి రూ.కోటి ప్రమాద బీమా

ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై కూడా బండ్ల గణేశ్ సెటైర్లు వేశారు. కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారని… పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. కేటీఆర్ చుట్టూ ఈగో వైఫై మాదిరి ఉంటుందని… వచ్చే ఎన్నికల్లో ఏదో సాధిస్తామనే భ్రమల్లో ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ కు మరిన్ని కష్టాలు తప్పవని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 17 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరో కేటీఆర్ చెప్పాలన్నారు. ఫోన్ రింగ్ అయినా కేటీఆర్ భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు.

Also Read: ఇందిరమ్మ అభయం… తొలి హామీని ప్రకటించిన వైఎస్ షర్మిల

కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే 3 సీట్లు కూడా రాకపోయేవని విమర్శించారు. అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ వెళ్ళారని ఆరోపించారు. మేం ఆరు గ్యారంటీలతో పాటు స్వేచ్ఛ అనే 7వ గ్యారెంటీ ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రికి చెప్పు చూపిస్తే ఎన్‌కౌంటర్ చేయించే వాళ్లని.. రాళ్లతో కొట్టి చంపించే వాళ్లని ఆరోపించారు. కేటీఆర్ హాయాంలో పని చేసిన ఆఫీసర్ల దగ్గర కోట్లాది రూపాయల నల్లధనం దొరుకుతోందన్నారు.

Also Read: నేను రాజకీయ సన్యాసానికి రెడీ… పొన్నం రెడీనా?: బండి సంజయ్

ఏపీ మంత్రి రోజా ఒక ఐటెమ్ రాణి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక జాక్ పాట్ సీఎం అంటూ రోజా వ్యాఖ్యానించిన నేపథ్యంలో… ఆమెకు బండ్ల గణేశ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రోజా ఒక డైమండ్ రాణి అని… ఆమె పని చేస్తున్న పార్టీ నాయకుడు ఒక యాక్సిడెంటల్ సీఎం అని అన్నారు. రోజాకు సీటు వస్తుందో.. రాదో అనే పరిస్థితి నెలకొందన్నారు రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని… రోజా మాదిరి చేపల పులుసు వండి పెడితే ఇక్కడ పదవులు రావని చెప్పారు. వందల యూ ట్యూబ్ ఛానెల్స్ పెట్టి రేవంత్ ని కేటీఆర్ తిట్టిస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button