తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KA Paul: మంద కృష్ణ మాదిగ అమ్ముడు పోయారు… కేఏ పాల్ సంచలన ఆరోపణలు

కుటుంబ పాలన, కుల పాలన వద్దని, ఇప్పుడు ఉన్న మూడు పార్టీలను పక్కన పెట్టేద్దామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. మంద కృష్ణ మాదిగ ప్రధాని నరేంద్ర మోదీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. విశ్వరూప సభకు 72 కోట్లు ఎవరిచ్చారు? బీజేపీయే ఇచ్చిందని ఆరోపించారు. ఈ సభలో మంద కృష్ణ మాదిగ మోదీని బాగా పొగిడారని, ఆయన దేవుడితో సమానమని చెప్పారని, అన్నా.. పెద్దన్న అంటూ బాగా నటించారని విమర్శించారు. కానీ నరేంద్ర మోదీ అంతకంటే పెద్ద నటుడు అని… వర్గీకరణ చేస్తానని ప్రధాని మోదీ చెప్పారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడవచ్చా? అని ప్రశ్నించారు.

రుణమాఫీ ఎందుకు చేయడం లేదు

ట్రంప్ చిన్న తప్పు చేసినందుకు అమెరికాలో ఆయనను అరెస్ట్ చేశారన్నారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి లక్షల కోట్లు దోచుకుంటున్నారని, ప్రధాని వ్యాపారులకు రుణమాఫీ చేస్తున్నారని, కానీ పేదలకు 25 వేలు ఎందుకు రుణమాఫీ చేయడం లేదు? అని ప్రశ్నించారు. వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ చాలా కష్టపడ్డారని, పోరాటం చేశారన్నారు. కానీ చివరకు అమ్ముడు పోయారన్నారు.

మందకృష్ణ అమ్ముడుపోయారు

ప్రజా శాంతి పార్టీలో చేరమంటే 25 కోట్లు అడిగారని, మరి ఈ రోజు బీజేపీకి ఓటు వేయమని చెబుతున్నారని, ఆయనకు 250 కోట్లు ముట్టాయా? .500 కోట్లు ముట్టాయా? అని నిలదీశారు. లేక రాజ్యసభ అవకాశం ఇచ్చి, కేంద్రమంత్రిగా చేస్తానని చెప్పారా? అని ప్రశ్నించారు. మాల, మాదిగల మధ్య విభేదాలు వద్దన్నారు. ఆ మూడు పార్టీలకు ఓటు వేస్తే మీకు నష్టమన్నారు. మీరు ఓటు వేయాలనుకుంటే నోటాకు వేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button