తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Merio: కేటీఆర్ ను మించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు.. ఒక్క రోజులోనే దిగ్గజ కంపెనీ రాక

ఇన్నాళ్లు ఐటీ మంత్రిగా కేటీఆర్ చేసినట్టు ఇంకెవరూ చేయరు అని ప్రచారం జరిగింది. కానీ కేటీఆర్ ను మించి కొత్త ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పని చేస్తున్నారు. ఆయన మంత్రిగా ఇలా బాధ్యతలు చేపట్టారో లేదో అలా ఓ దిగ్గజ కంపెనీని తెలంగాణకు తీసుకొచ్చారు. బాధ్యతలు చేపట్టిన తర్వాతి రోజే ఓ పెద్ద కంపెనీని తీసుకురావడంతో శ్రీధర్ బాబు తనదైన మార్క్ నెలకొల్పాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చదవండి: గవర్నర్ ప్రసంగం కాదు కాంగ్రెస్ మేనిఫెస్టో: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు

హెచ్ సీ రోబోటిక్స్ ఫ్రెంచ్ కంపెనీ మేరియా రక్షణ దళాలకు అవసరమైన ‘గింబల్స్’ తయారుచేస్తుంది. భారత రక్షణ దళాలకు అవసరమయ్యే ఆధునిక ‘గింబల్స్’ తయారీ పరిశ్రమను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఫ్రెంచ్ కంపెనీ మేరియా ముందుకు వచ్చింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబును ఆ సంస్థ ప్రతినిధులు కలిశారు. మేరియా కంపెనీ సీఈఓ రెమీప్లెనెట్, డైరెక్టర్ రాధాకిశోర్ తో కూడిన బృందం మంత్రితో సమావేశమైంది.

Also Read పవన్ కు భారీ షాక్.. జనసేనతో పొత్తు వద్దన్న కిషన్ రెడ్డి

హైదరాబాద్ లో మేరియా కార్యకలాపాలకు ప్రభుత్వపరంగా మద్దతునివ్వాలని ఆ బృందం కోరింది. కచ్చితంగా మద్దతు ఇచ్చి కంపెనీకి సహకరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే హైదరాబాద్ కు పరిశ్రమలు రావనే ప్రచారం సోషల్ మీడియాలో తెగ జరిగింది. అసలు కేటీఆర్ లేకపోతే ఐటీ యే లేదు అన్నంతగా ఊదరగొట్టారు. ఇప్పుడు ఈ కంపెనీ రాకతో అలాంటి వార్తలకు అడ్డు కట్ట పడినట్లైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button