తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Police Case: 47 ఎకరాల భూమి కబ్జా… మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

గిరిజనుల భూములు కబ్జా చేశారని శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు తెలిపారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు రావడంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ నమోదు అయ్యింది.

Also Read:  ఇక ధరణిపై రేవంత్ దృష్టి.. సమస్యల పరిష్కారానికి కమిటీ!

మల్లారెడ్డితో పాటు 9 మందిపై కేసు నమోదు

మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు, కుట్రతో మోసగించి భూమిని కాజేశారని శామీర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. విచారణ చేపట్టిన పోలీసులు మాజీ మంత్రి, అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్) సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై పోలీసులు కేసు పెట్టారు.

Also Read:  కాంగ్రెస్ ప్రభుత్వంపై తొలిసారి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మాయమాటలు చెప్పి వేలిముద్రలు

అది వారసత్వంగా వచ్చిన భూమి అని ఆరుగురిపై ఉందని బాధితుడు కేతా వత్ భిక్షపతి నాయక్ తెలిపారు. నిరక్ష్యరాస్యులైన తమకు మాయమాటలు చెప్పి మాతో వేలిముద్రలు వేయించుకొని 250 కోట్ల విలువ చేసే భూమిని పీటీ సరెండర్ చేయించారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ భూమిపై తాము హక్కులు కోల్పోయేలా చేశాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము నిరుపేదలమని ఈ భూమి కబ్జాపై విచారణ చేపట్టాలని బాధితులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button