తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Madhu Yaskhi Goud అర్ధరాత్రి కలకలం.. మధుయాష్కీ నివాసంలో పోలీసుల తనిఖీలు

హైదరాబాద్: అర్ధరాత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎల్బీనగర్ (LB Nagar) అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ నివాసంపై పోలీసులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇంటిపై దాడి చేసి తనిఖీల పేరుతో హల్ చల్ చేశారు. పెద్ద ఎత్తున డబ్బు నిల్వలు ఉందనే సమాచారంతో తాము తనిఖీలు చేస్తున్నామని పోలీసులు బుకాయించారు. అయితే, పోలీసులు లోపలకు రాకుండా మధుయాష్కీ (Madhu Yaskhi Goud)తోపాటు ఆయన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డగించారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి కలకలం రేపింది.

Also Read ఎన్నికల వేళ కేసీఆర్ కు షాక్.. సినిమా ఆగిపోయింది

హైదరాబాద్ (Hyderabad)లోని హయత్ నగర్ (Hayat Nagar)లో మాజీ ఎంపీ మధుయాష్కీ నివసిస్తున్నారు. ఎల్బీ నగర్ బరిలో దిగడంతో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఒక్కసారిగా పోలీసులు అతడి నివాసంలోకి వెళ్లారు. అనుమతి లేకుండా పోలీసులు లోపలికి రావడంతో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. దాడుల పేరుతో తమ కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మధుయాష్కీ తెలిపారు. అసలు అనుమతి (Permission) లేకుండా ఎలా వస్తారని ప్రశ్నించారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ (Congress Party) లక్ష్యంగా దాడులు చేస్తున్నారని మధుయాష్కీ మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Also Read ఇంట‌ర్ 3 కాలేజీల్లో చ‌దివారా? మ‌ల్లారెడ్డి నామినేష‌న్ త‌ప్పుల‌త‌డ‌క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button