తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana Tour ప్రచారంలో కాంగ్రెస్ జోరు.. ఇక్కడే రాహుల్ 6 రోజులు మకాం

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. సర్వేలన్నీ అనుకూలంగా వస్తుండడంతో ఫుల్ జోష్ తో కాంగ్రెస్ పార్టీ (Congress Party) శ్రేణులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. పార్టీ కేడర్ (Cadre)లో మరింత ఉత్సాహం నింపేలా.. ప్రజలను పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా సరికొత్త వ్యూహాలకు కాంగ్రెస్ పదును పెడుతోంది. ఈ క్రమంలోనే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విస్తృత ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి పార్టీకి ఉత్తేజం తీసుకువచ్చిన రాహుల్ మరింత జోష్ నిచ్చేలా ఐదు రోజులపాటు తెలంగాణలోనే ఉండనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాహుల్ పర్యటన ఖరారైందని సమాచారం.

Also Read  100 రోజుల్లో 6 గ్యారంటీలు పక్కా.. నేను గ్యారంటీ

సీఎం కేసీఆర్ (KCR) పాలనపై వ్యతిరేకత భారీగా ఉండడంతో ప్రజలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక అద్భుతమైన మేనిఫెస్టో, ఆకర్షణీయ పథకాలు ప్రకటించడంతో ప్రజలు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే భావనలో ఉన్నారు. ప్రజా మద్దతు మరింత పెరిగేలా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం (Election Campaign) చేయనున్నారు. ఈనెల 17 నుంచి 23 దాకా తెలంగాణలో పర్యటిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. భువనగిరి, పాలకుర్తి, వరంగల్ బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లకుండా 6 రోజులు తెలంగాణలోనే ఉండనున్నట్లు సమాచారం.

Also Read పక్కా కాంగ్రెస్ దే విజయం.‌. ఇదిగో సాక్ష్యం

అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, రాహుల్ పర్యటన (Tour) మాత్రం భారీగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. రాహుల్ ఆరు రోజులు రాష్ట్రంలో మకాం వేస్తే ఇంకా కాంగ్రెస్ కు తిరుగుండదు.. ఓటమి ఎరుగదు. రాహుల్ ప్రచారం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button