తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Huge Support: కాంగ్రెస్ కు జై కొట్టు.. కేసీఆర్ ను ఓడగొట్టు

తెలంగాణ ఇచ్చిన. తెచ్చిన పార్టీ ఏదీ అని చెబితే అందరి నోట కాంగ్రెస్ పేరే వస్తుంది. అరవై ఏండ్ల కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీని ఈసారి ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెచ్చిన తెలంగాణను (Telangana) సీఎం కేసీఆర్ ఎలా చేసిండో ప్రజల అందరి మదిలో ఉంది. రాష్ట్రం బాగుపడాలన్నా.. ఉద్యోగాలు (Jobs) రావాలన్నా.. తమ భవిష్యత్ బాగుండాలన్నా కాంగ్రెస్ రావాల్సిందేనని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) కాంగ్రెస్ కు అధికారం అప్పగించాలనే ధృడ సంకల్పంతో ఉన్నారు. ఈ క్రమంలోనే అన్ని సంఘాలు, పార్టీలు హస్తం గుర్తుకు ఓటేయాలని పిలుపునిస్తున్నాయి. ఇప్పటికే సీపీఐ (CPI), తెలంగాణ జన సమితి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP), ముస్లిం లీగ్, ఆర్ఎస్పీ, తెలంగాణ ప్రజా సమితి పార్టీతోపాటు మరిన్ని ప్రజా సంఘాలు కాంగ్రెస్ కు జై కొడుతున్నాయి. తాజాగా మాదిగ, ఉప కులాల సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.

Also Read సీఎం కేసీఆర్ సభలో కలకలం.. యువకుడి జేబులో బుల్లెట్లు

తెలంగాణ భూ రక్షణ సమితి, చర్మకారుల లెదర్ పరిశ్రమ, దళిత అసైన్డ్ భూముల పరిరక్షణ సంఘాలు గురువారం కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఎన్నికల్లో ప్రజలందరూ హస్తం గుర్తు పార్టీకి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఏఐసీసీ (AICC) రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఎస్సీ సెల్ చైర్మన్ నగరిగారి ప్రీతమ్ తదితరులతో ఆ సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజా సమితి పార్టీ అధ్యక్షురాలు నీరా కిశోర్ కూడా కాంగ్రెస్ పార్టీకి (Congress Party) మద్దతునిచ్చారు.

Also Read కాంగ్రెస్ కు అధికారం ఇస్తే 2 లక్షల ఉద్యోగాలు

అవినీతి కేసీఆర్ సర్కార్ (KCR)ను గద్దె దింపడానికి అందరూ కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్నారు. బీఆర్ఎస్ (BRS Party)ను ఓటమికి కాకుండా గెలుపునకు బీజేపీ పని చేస్తుందనే వాస్తవాన్ని అందరూ గ్రహిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ను ఓడించాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని నమ్ముతున్నారు. విడిగా.. ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు (Votes) చీలి గులాబీ పార్టీకే మేలు జరుగుతుందనే భావనతో కొన్ని పార్టీలు ఎన్నికల బరిలో నిలవలేదు. ఇక కుల, మత, విద్యార్థి, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ప్రైవేటు సంఘాలు, ప్రజా సంఘాలు కూడా పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు తెలిపాయి. ఇక నామినేషన్ల సమయంలో స్వతంత్రులుగా (Independents) బరిలో దిగిన వారు కూడా పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. భారీగా నామినేషన్లు ఉపసంహరించుకున్న వారు కాంగ్రెస్ కే ఓటేయాలని పిలుపునిచ్చారు.

సంపూర్ణ మద్దతు
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila), తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండ రాం (Kodanda Ram), సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు అడగగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చారు. కేసీఆర్ పై ఉమ్మడి పోరాటానికి ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు కలిసి పోరాడుదాం.. తర్వాత చూసుకుందాం అనే భావనతో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. మద్దతు ప్రకటించడమే కాదు క్షేత్ర స్థాయిలో పార్టీ అభ్యర్థుల (Candidates) గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు, సంఘాల ప్రతినిధులు పని చేస్తున్నారు.

అందరి లక్ష్యం ఒకటే కేసీఆర్ ను పదవి నుంచి దించేయడమే. తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి (Development) పథంలో నడపడమే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని.. యువతకు ఉద్యోగాలు వస్తాయని వారు నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్ ను బలపరుస్తున్నారు. పోలింగ్ తేదీ సమీపానికి వస్తున్న కొద్దీ కాంగ్రెస్ మరింత బలోపేతమవుతోంది. మరికొన్ని రోజుల్లో మరిన్ని సంఘాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తుంటే డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button