తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS Party: పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం: కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాఠాలు నేర్చుకుని సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుతామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిథ్యం ఉండాల్సిందేనని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పారు. కానీ ఎగిరేది గులాబీ జెండేనని ధీమా వ్యక్తం చేశారు.

Also Read క్రికెటర్ కాస్త ఎంపీ అయ్యాడు.. ఎన్నికల్లో గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్

లోక్ సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సోమవారం నిజామాబాద్ సెగ్మెంట్ పై చర్చించారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ప్రాతినిధ్యం కోసం గట్టిగా కొట్లాడితే విజయం మనదే. పార్టీకి గెలుపోటములు కొత్త కాదు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

Also Read తప్పతాగి రోడ్డుపై మాజీ మంత్రి మేనల్లుడు బీభత్సం.. ఇద్దరికి గాయాలు

‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చి మాట దాటేస్తోంది. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పులు, శ్వేత పత్రాల పేరిట తప్పించుకునే డ్రామాలు చేస్తున్నారు. పేదల కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తోంది. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి తదితర సంక్షేమ పథకాలు రద్దు చేస్తే లబ్ధిదారులతో పోరాటం చేస్తాం’ అని కేటీఆర్ తెలిపారు. రైతుబంధు డబ్బులు వేయకుండా ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలో నిర్ణయాలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button