తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TSPSC: టీఎస్‌పీఎస్సీకి కొత్త చైర్మన్ వచ్చేశాడు.. ఎవరంటే?

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించాలని ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ గురువారం ఆమోదం తెలిపారు. అలాగే టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా రిటైరర్డ్‌ ఐఏఎస్‌ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్‌ ఉల్లా ఖాన్‌, యాదయ్య, వై రాంమోహన్‌రావు నియమితులయ్యారు.

ALSO READ:  ఓటరు దినోత్సవంలో గవర్నర్ తమిళిసై.. కొందరు చస్తామని ఓట్లు అడిగారని సెటైర్లు

చైర్మన్‌ పోస్టింగ్‌‌కు 370 వరకు దరఖాస్తులు

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో కమిషన్‌లో మార్పులు చేయాలని కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటీవల టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంపై సర్కారు దృష్టి పెట్టింది. అయితే ఈ పోస్టల కోసం ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరించింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ పోస్టింగ్‌ కోసం మొత్తం 370 వరకు దరఖాస్తులు అందాయి. దీంతో ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని నియమించి దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలించి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది.

ALSO READ: పాదచారుల కష్టాలకు చెక్… త్వరలోనే మెహదీపట్నంలో స్కై వాక్

డిసెంబర్‌ వరకే పదవిలో..

ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్ణాపురంలో ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి జన్మించారు. 1968లో ఏఎప్పీగా మొదలైన ఆయన కెరీర్‌ డీజీపీగా పదవీ విరమణ పొందారు. 2017 నవంబర్‌ 12న ఇన్‌ఛార్జి డీజీపీగా నియమితులైన ఆయన 2018 ఏప్రిల్‌10న పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2022 డిసెంబర్‌లో డీజీపీగా పదవీ విరమణ పొందారు. కాగా, ఆయన ఈ ఏడాది డిసెంబర్‌ వరకే పదవిలో కొనసాగనున్నారు. కమిషన్‌ నిబంధనల ప్రకారం.. 62 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button